'జోష్' చిత్రంతో హీరోగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున తనయుడు నాగచైతన్యతో ఓ కొత్త చిత్రాన్ని కామాక్షి కళా మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఇంతవరకూ నాగార్జున హీరోగా ఈ బ్యానర్ నుంచి పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ చూరగొన్నాయి. ఈమధ్యనే నాగార్జునతో 'కింగ్' వంటి హిట్ చిత్రాన్ని అందించిన శివప్రసాద్ రెడ్డి తాజాగా నాగార్జునతోనే కిరణ్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తీస్కున్నారు. దీనికి 'రమ్మీ' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది జనవరి రెండోవారంలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. జనవరిలోనే నాగచైతన్య హీరోగా కొత్త చిత్రం ప్రారంభమవుతుందని శివప్రసాద్ రెడ్డి శుక్రవారంనాడు తెలిపారునాగచైతన్య చిత్రానికి అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయిందనీ, త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామనీ అన్నారు. 2010లో తమ సంస్థ సిల్వర్ జూబ్లీ (25 ఏళ్లు) అనీ, అదే ఏడాది జనవరిలో నాగార్జున సినిమా రిలీజ్ చేసి, నాగచైతన్యతో సినిమా ప్రారంభిస్తామని చెప్పారు. నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మంజుల నిర్మిస్తున్న 'నాతో...రా' చిత్రంలో నటిస్తున్నారు
No comments:
Post a Comment