అగ్రహీరోలలో ఒకరిగా ఇప్పటికీ తన సత్తా చాటుకుంటున్న నాగార్జున ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షీ కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న 'రమ్మీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిరణ్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. నాగార్జునకు ఉన్న డిసెంబర్ రిలీజ్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరి వారంలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దీని తర్వాత నాగార్జున నటించబోయే సినిమా కూడా ఇప్పటికే ఖరారైంది. దీనికి 'పయనం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రాథామోహన్ దర్శకుడు.సున్నిత మైన కథాంశంతో 'ఆకాశమంత' చిత్రానికి ఇటీవల రాధామోహన్ దర్శకత్వం వహించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన టేకింగ్ నాగార్జునకు నచ్చడంతో తదుపరి చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆసక్తికరంగా ఈ చిత్రం మూడు భాషల్లో ఏకకాలంలో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే మూడు భాషల్లోనూ నిర్మాతలు వేర్వేరుగా ఉండబోతున్నారు. తెలుగు వెర్షన్ ను దిల్ రాజు నిర్మించనుండగా, ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్న ప్రకాష్ రాజ్ తమిళ వెర్షన్ ను తన డ్యూయెట్ బ్యానర్ లో నిర్మించబోతున్నారు. హిందీ వెర్షన్ పై బోనీకపూర్ ఇప్పటికే మనసు పారేసుకున్నట్టు సమాచారం. భావోద్వేగాలతో కూడిన సున్నితమైన కథాంశంగా 'పయనం' ఉండబోతోంది. రైలులోనే 25 రోజుల పాటు షూటింగ్ జరపబోతున్నారు. డిసెంబర్ లో షూటింగ్ మొదలవుతుంది
No comments:
Post a Comment