అమెరికాలో గత మూడేళ్లుగా పలు విజయవంతమైన చిత్రాల పంపిణీ, ప్రదర్శన చేపట్టిన బే-మూవీస్ 'ఇంకోసారి' చిత్రం ద్వారా చిత్రనిర్మాణరంగంలోకి కూడా అడుగుపెట్టింది. సుమన్ పాతూరి దర్శకత్వంలో కల్యాణ్ పళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. 'వెన్నెల' చిత్రం టీమ్ లోని రాజా, కిషోర్ (ఖాదర్), రవి వర్మ, సుమన్ పాతూరి, మహేష్ శంకర్ (సంగీతం) తిరిగి ప్రేక్షకులను ఈ చిత్రంతో అలరించబోతున్నారు. మంజరి ఫడ్నిస్, రిచా పల్లాడ్, సయాలి భగత్ హీరోయిన్లుగా నటించారు.జరిగిపోయిన జీవితం మరోసారి మన ముంగిటకు వస్తే ఏం చేస్తామన్నదే 'ఇంకోసారి' కాన్సెప్ట్. ఈ చిత్రంలోని క్యారెక్టర్లు, సంఘటనలు కల్పితాలనీ, మనందరి జీవితాల్లో చోటుచేసుకునే సంఘటనలకు అతి దగ్గరగా ఉంటాయనీ ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు. కాలేజీలో కలిసి చదువుకున్న ఏడుగురు మిత్రులు ఏడేళ్ల తర్వాత కలుసుకుంటారు. బాధ్యతలు, కుటుంబాలకు దూరంగా తిరిగి కాలేజీ రోజులను తిరగదోడుకునే నేపథ్యంలో వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కాలేజీ రోజుల్లో అనుకుని సాధించలేని ఓ పనిని తిరిగి చేయాలనుకుంటారు. ఇప్పుడు రెండో ఛాన్స్ వచ్చింది. అదే 'ఇంకోసారి'. ఈ చిత్రానికి రాజ్, డికె, సీతా మీన్ ('ఫ్లేవర్స్', '99' ఫేమ్) కథ-స్క్రీన్ ప్లే అందించగా, నాగరాజు గంధం ('గమ్యం', 'బాణం' ఫేమ్) సంభాషణలు, మహేష్ శంకర్ సంగీతం అందించారు. ఈ సీజన్ లోని కూలెస్ట్ మూవీగా డిసెంబర్ లో 'ఇంకోసారి' విడుదలకు సిద్ధమవుతోంది.
No comments:
Post a Comment