నాగచైతన్య 'నాతో రా..'

'జోష్' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన నాగార్జున తనయుడు నాగచైతన్య ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ బాబు సోదరి మంజుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్తుతున్న ఈ చిత్రానికి 'నాతో రా' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తమిళంలో 'విన్నైతాండి వరువాయ' పేరుతో శింబు, త్రిష జంటగా ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. తమిళ టైటిల్ కు దగ్గరగా ఉండేలా 'నాతో రా' అనే టైటిల్ ను ఆయన అనుకుంటున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు

No comments:

Post a Comment