వర్మ 'రక్త చరిత్ర' - ప్రత్యేకం

సంచలనాలకు మరో పేరు రామ్ గోపాల్ వర్మ. 'సత్య', 'రంగీలా', 'వర్మ కా షోలే'...ఇలా ఏ సినిమా తీసినా ఆయన మార్క్ సంచలనాలకు కొదవుండదు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పడం, ఇందులోనూ బోలెడంత సంచలనాలు సృష్టించడం ఆయనకే చెల్లు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్టయినా, ఫెయిలయినా మళ్లీ మళ్లీ కొత్త కాన్సెప్ట్ లతో ముందుకు రావడానికి ఏమాత్రం వెనుకాడరు. చాలాకాలం తర్వాత ఆయన మళ్లీ 'రక్త చరిత్ర' అనే తెలుగు స్ట్రయిట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని ఏకకాలంలో తమిళ, హిందీ భాషల్లోనూ చిత్రీకరిస్తూ మూడు భాషల్లోని మేటి స్టార్స్ ను ఇందులో నటింపజేస్తున్నారు. పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రెండు భాగాలుగా 'రక్త చరిత్ర' పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పరిటాల రవిగా వివేక్ ఒబెరాయ్, సూరి పాత్రలో తమిళ హీరో సూర్య, ఎన్టీఆర్ పాత్రలో శత్రుఘ్నసిన్హా నటిస్తున్నారు. తన కెరీర్ లో హిట్లు, ఫ్లాపులు, 'రక్తచరిత్ర' సమాచారం వర్మ 'నా చరిత్ర' పేరుతో తాజాగా ఆవిష్కరించారు. ఆయన చెప్పిన ముచ్చట్లు ఆయన మాటల్లోనే....
నేనెప్పుడూ అంటూ వుంటాను గొప్ప దర్శకులు, గొప్ప నటులు ఉండరు. కేవలం బాగా దర్శకత్వం వహించిన సినిమాలు, బాగా నటించిన పాత్రలు మాత్రమే ఉంటాయని. దర్శకుడు ఎంపిక చేసుకు్న కథా వస్తువుని బట్టే గొప్పగా దర్శకత్వం వహించడానికి అవకాశం ఉంటుంది. అలాగే నటుడు తను నటించిన పాత్రల ఔన్నత్యాన్ని బట్టే గొప్పగా నటించాడని పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 'శివ' తీసింది నేనే. 'శివ 2006' తీసింది కూడా నేనే. రెండింటికి డైరెక్టర్ నేనే అయినప్పుడు ఒకటి చాలా బాగా, ఇంకొకటి చాలా నీచంగా రావడానికి కారణం ఏమిటి? ఎంచుకున్న కథా వస్తువును బట్టి డైరెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మారిపోతూ ఉంటుది.-ఓ ఫిల్మ్ మేకర్ కు ఉన్న అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే....తీసుకున్న కథావస్తువు తనకి బాగా 'కొట్టినపిండి' అని ఫీలయినప్పుడు ఒక అహకారం రావడం ఖాయం.-శివ...కాలేజీ క్యాంపస్ లో నేను చూసి, అనుభవించిన గూండాయిజాన్ని తెరకెక్కించాలన్న బలమైన కోరిక వల్ల జన్మించింది.-క్షణక్షణం....శ్రీదేవిని ఎంత అందంగా చూపొంచొచ్చన్న తపనతో రూపొందింది

No comments:

Post a Comment