లీడర్'లో ఉదయభాను ఐటెం

టెలివిజన్ కార్యక్రమాల్లో యాంకర్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయభాను నటిగా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంటోంది. పదునాలుగేళ్ల ప్రాయంలోనే 'ఎర్రసైన్యం' చిత్రం ద్వారా తొలిసారి కెమెరాను ఫేస్ చేసిన ఉదయభాను ఆ తర్వాత వివిధ ఛానెల్స్ లో యాంకర్ గా బిజీ అయింది. 'హార్లిక్స్ హృదయాంజలి', వేణుమాధవ్ తో కలిసి 'వన్స్ మోర్', ఆ తర్వాత 'సాహసం చేయరా డింభకా', 'జానవులే నెరజాణవులే' ఇలా ప్రతి కార్యక్రమం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఆమె మరోసారి వెండితెరపై తళుక్కుమని మెరవబోతోంది. 'లీడర్ ' చిత్రం కోసం ఆమె ఓ స్పైసీ ఐటెం సాంగ్ లో నర్తిస్తున్నట్టు సమాచారం.

మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనువడు దగ్గుబాటి రాణా తొలిసారి కథానాయకుడుగా 'లీడర్' చిత్రంతో పరిచయమవుతున్నారు. ఎవిఎం బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి జీనియర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతవరకూ సున్నితమైన ప్రేమకథాంశాలకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల తొలిసారిగా రాజకీయ నేపథ్యంలో 'లీడర్' చిత్రం తెరకెక్కిస్తుడటం సహజంగానే ఈ చిత్రంపై క్యూరియాసిటీని పెంచుతోంది. వచ్చే వారంలో జరిగే ఓ కార్యక్రమంలో రాణాను తొలిసారి ప్రేక్షకులు, మీడియాకు పరిచయం చేసి నవంబర్ 24న ఆడియో, క్రిస్మస్-సంక్రాంతి పండుగలు కలిసొచ్చేలా డిసెంబర్ 24న సినిమా రిలీజ్ కు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


No comments:

Post a Comment