నాగార్జున హీరోగా కామాక్షి కళా మూవీస్ పతకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం 12 చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. కిరణ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని జనవరి రెండో వారంలో సంక్రాంతి కానుగా విడుదల చేస్తామని శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఇది తమ సంస్థ సిల్వర్ జూబ్లీ ఇయర్ కానుకగా ఆయన చెప్పారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ప్రోగ్రస్ ను శుక్రవారంనాడు ఆయన తెలియజేశారు.కామాక్షి బ్యానర్ ను 1984లో ప్రారంభించగా, 1985లో తొలి చిత్రం 'శ్రావాణ సంధ్య' రిలీజ్ అయిందనీ, 2010 సిల్వర్ జూబ్లీ ఇయర్ కానుందనీ ఆయన తెలిపారు. గతంలో సంక్రాంతికి విడుదల చేసిన 'శ్రావణసంధ్య', 'ముఠామేస్త్రి' చిత్రాలు ఘనవిజయం సాధించాయనీ, నాగార్జునతో తీస్తున్న కొత్త చిత్రం మళ్లీ చాలా కాలం తర్వాత జనవరి రెండో వారంలో విడుదలవుతోందనీ చెప్పారు. ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అనీ, స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ ఉంటుందనీ తెలిపారు. ఖర్చుకు వెనుకాడకుండా చాలా లావిష్ గా, స్టైలిష్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందన్నారు. ఇంతవరకూ 80 రోజుల పాటు షూటింగ్ జరిపామనీ, మరో 20 రోజుల వర్క్ ఉందని చెప్పారు. ప్రస్తుతం నాగార్జునతో 'డాన్' విలన్ కెల్లీడార్జ్ పాల్గొన్న ఫైట్ ను సారధి స్టూడియోస్ లో తీస్తున్నామనీ, అలాగే గ్రీస్ లో నాగార్జున, మమతా మోహన్ దాస్ పై ఓ పాట, నాగార్జున, మోడల్స్ పై మరో పాట తీస్తామనీ, క్లైమాక్స్ హైద్రాబాద్ లో ప్లాన్ చేశామనీ చెప్పారు. చివర్లో నాగార్జునతో ఓ ఐటమ్ గర్ల్ పాల్గొనే సెట్ సాంగ్ తో షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఇందులో నాగార్జున కొత్త స్టైల్ లో కనిపిస్తారనీ, హీరోయిన్ గా మమతా మోహన్ దాస్, అమెరికా అమ్మాయి లిండా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోందని చెప్పారు. అంకుర్ ('స్లమ్ డాగ్ మిలియనీర్ ' ఫేమ్) విలన్ గా నటిస్తుండగా, నిర్మల్ పాండే ('బాండిట్ క్వీన్' ఫేమ్), అఖిలేంద్ర మిశ్రా ('లగాన్' ఫేమ్), కెల్లీడార్జ్ పాత్రలు హైలైట్ అవుతాయన్నారు. త్వరలోనే టైటిల్ నిర్ణయిస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, బ్రహ్మానందం, వర్షవర్దన్, తనికెళ్ల భరణి నటిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం కిరణ్ అందిస్తున్నారు. చంద్రబోస్-కృష్ణ చైతన్య పాటలు, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, సెల్వ ఫైట్స్, శ్రవణ్ ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు.సంక్రాంతికి నాగార్జున చిత్రం
నాగార్జున హీరోగా కామాక్షి కళా మూవీస్ పతకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం 12 చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. కిరణ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని జనవరి రెండో వారంలో సంక్రాంతి కానుగా విడుదల చేస్తామని శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఇది తమ సంస్థ సిల్వర్ జూబ్లీ ఇయర్ కానుకగా ఆయన చెప్పారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ప్రోగ్రస్ ను శుక్రవారంనాడు ఆయన తెలియజేశారు.కామాక్షి బ్యానర్ ను 1984లో ప్రారంభించగా, 1985లో తొలి చిత్రం 'శ్రావాణ సంధ్య' రిలీజ్ అయిందనీ, 2010 సిల్వర్ జూబ్లీ ఇయర్ కానుందనీ ఆయన తెలిపారు. గతంలో సంక్రాంతికి విడుదల చేసిన 'శ్రావణసంధ్య', 'ముఠామేస్త్రి' చిత్రాలు ఘనవిజయం సాధించాయనీ, నాగార్జునతో తీస్తున్న కొత్త చిత్రం మళ్లీ చాలా కాలం తర్వాత జనవరి రెండో వారంలో విడుదలవుతోందనీ చెప్పారు. ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అనీ, స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ ఉంటుందనీ తెలిపారు. ఖర్చుకు వెనుకాడకుండా చాలా లావిష్ గా, స్టైలిష్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందన్నారు. ఇంతవరకూ 80 రోజుల పాటు షూటింగ్ జరిపామనీ, మరో 20 రోజుల వర్క్ ఉందని చెప్పారు. ప్రస్తుతం నాగార్జునతో 'డాన్' విలన్ కెల్లీడార్జ్ పాల్గొన్న ఫైట్ ను సారధి స్టూడియోస్ లో తీస్తున్నామనీ, అలాగే గ్రీస్ లో నాగార్జున, మమతా మోహన్ దాస్ పై ఓ పాట, నాగార్జున, మోడల్స్ పై మరో పాట తీస్తామనీ, క్లైమాక్స్ హైద్రాబాద్ లో ప్లాన్ చేశామనీ చెప్పారు. చివర్లో నాగార్జునతో ఓ ఐటమ్ గర్ల్ పాల్గొనే సెట్ సాంగ్ తో షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఇందులో నాగార్జున కొత్త స్టైల్ లో కనిపిస్తారనీ, హీరోయిన్ గా మమతా మోహన్ దాస్, అమెరికా అమ్మాయి లిండా ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోందని చెప్పారు. అంకుర్ ('స్లమ్ డాగ్ మిలియనీర్ ' ఫేమ్) విలన్ గా నటిస్తుండగా, నిర్మల్ పాండే ('బాండిట్ క్వీన్' ఫేమ్), అఖిలేంద్ర మిశ్రా ('లగాన్' ఫేమ్), కెల్లీడార్జ్ పాత్రలు హైలైట్ అవుతాయన్నారు. త్వరలోనే టైటిల్ నిర్ణయిస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయాజీ షిండే, బ్రహ్మానందం, వర్షవర్దన్, తనికెళ్ల భరణి నటిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం కిరణ్ అందిస్తున్నారు. చంద్రబోస్-కృష్ణ చైతన్య పాటలు, సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, సెల్వ ఫైట్స్, శ్రవణ్ ఎడిటింగ్, సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment