'ఎన్.టి.ఆర్.నగర్', 'బ్లూ' చిత్రాలను నిర్మించిన నేస్తం క్రియేషన్స్ సంస్థ మూడో ప్రయత్నంగా 'రెడ్' అనే చిత్రానికి శ్రీకారం చుట్టింది. దర్శకనిర్మాత సాయిమోహన్ గౌడ్ సంగీత దర్శకుడు షాయక్ పర్వేజ్ తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైద్రాబాద్ లోని మాధవ్ సంజయ్ రికార్డింగ్ థియేటర్ లో శనివారం ప్రారంభమైంది. బాబ్జీ సాహిత్యం అందించిన 'గుండెల్లోన గోపరమల్లే ఎగిరెను జాతి పతాకం, పెదవులపైన వేదంలా వినిపించెను జాతీయగీతం' అనే పాట రికార్డింగ్ జరిగింది. ఫిలిం చాంబర్ కార్యదర్శి కె.సి.సేఖర్ బాబు, ఉపాధ్యక్షుడు సి.కల్యాణ్, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ తో పాటు పలువురు హాజరయ్యారు.సాయిమోహన్ గౌడ్ మాట్లాడుతూ, బాలీవుడ్ లో దర్శకురాలు దీపామెహతా 'ఫైర్', 'ఎర్త్', 'వాటర్' వంటి పంచభూతాలను కథాంశాలుగా ఎంచుకుని చిత్రాలను రూపొందిస్తూ కొత్త ఒరవడిని సృష్టించారనీ, అదే తరహాలో సప్తవర్ణాలను కథాంశాలుగా తీసుకుని తాను సినిమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే తాను తీసిన 'బ్లూ' చిత్రానికి నంది అవార్డు వచ్చిందన్నారు. దుర్మార్గంపై సంధించిన అభ్యుదయాస్త్రం ఎరుపు అనే కథాంశంతో 'రెడ్' చిత్రం ఉంటుందని చెప్పారు. డిసెంబర్ మొదటివారంలో షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. కథ నచ్చి నిర్మాణ భాగస్వామిగా మారినట్టు చిత్ర సంగీత దర్శకుడు షాయజ్ పర్వేజ్ తెలిపారు. ఈ చిత్రంలో ఆలీ, నాజర్, ఆశిష్ విద్యార్థి, ఎమ్మెస్ నారాయణ, సుమన్ శెట్టి, అభినయశ్రీ, సీత, గౌతంరాజు తారాగణం'రెడ్' పాటల రికార్డింగ్
'ఎన్.టి.ఆర్.నగర్', 'బ్లూ' చిత్రాలను నిర్మించిన నేస్తం క్రియేషన్స్ సంస్థ మూడో ప్రయత్నంగా 'రెడ్' అనే చిత్రానికి శ్రీకారం చుట్టింది. దర్శకనిర్మాత సాయిమోహన్ గౌడ్ సంగీత దర్శకుడు షాయక్ పర్వేజ్ తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైద్రాబాద్ లోని మాధవ్ సంజయ్ రికార్డింగ్ థియేటర్ లో శనివారం ప్రారంభమైంది. బాబ్జీ సాహిత్యం అందించిన 'గుండెల్లోన గోపరమల్లే ఎగిరెను జాతి పతాకం, పెదవులపైన వేదంలా వినిపించెను జాతీయగీతం' అనే పాట రికార్డింగ్ జరిగింది. ఫిలిం చాంబర్ కార్యదర్శి కె.సి.సేఖర్ బాబు, ఉపాధ్యక్షుడు సి.కల్యాణ్, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ తో పాటు పలువురు హాజరయ్యారు.సాయిమోహన్ గౌడ్ మాట్లాడుతూ, బాలీవుడ్ లో దర్శకురాలు దీపామెహతా 'ఫైర్', 'ఎర్త్', 'వాటర్' వంటి పంచభూతాలను కథాంశాలుగా ఎంచుకుని చిత్రాలను రూపొందిస్తూ కొత్త ఒరవడిని సృష్టించారనీ, అదే తరహాలో సప్తవర్ణాలను కథాంశాలుగా తీసుకుని తాను సినిమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే తాను తీసిన 'బ్లూ' చిత్రానికి నంది అవార్డు వచ్చిందన్నారు. దుర్మార్గంపై సంధించిన అభ్యుదయాస్త్రం ఎరుపు అనే కథాంశంతో 'రెడ్' చిత్రం ఉంటుందని చెప్పారు. డిసెంబర్ మొదటివారంలో షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. కథ నచ్చి నిర్మాణ భాగస్వామిగా మారినట్టు చిత్ర సంగీత దర్శకుడు షాయజ్ పర్వేజ్ తెలిపారు. ఈ చిత్రంలో ఆలీ, నాజర్, ఆశిష్ విద్యార్థి, ఎమ్మెస్ నారాయణ, సుమన్ శెట్టి, అభినయశ్రీ, సీత, గౌతంరాజు తారాగణం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment