అలరించే 'అందరి బంధువయ'

'ఆ నలుగురు', 'మధుమాసం' వంటి క్లీన్ ఎంటర్ టైనర్ లను అందించిన చంద్ర సిద్దార్థ నుంచి వస్తున్న మరో మంచి కథా చిత్రం 'అందరి బంధువయ'. మనసులో ఎలాంటి ద్వేషభావాలు లేకుండా ప్రేమ, ఆప్యాయతలను నింపుకొన్న ఏ వ్యక్తి అయినా అందరికీ బంధువవుతాడనీ, అలాంటి వ్యక్తికి చెందిన కథాంశమే ఈ చిత్రమనీ దర్శకనిర్మాత చంద్రసిద్దార్థ తెలిపారు. ఇందులో శర్వానంద్, పద్మప్రియ హీరోహీరోయిన్లుగా నటించాను.స్వార్ధంతో కాకుండా నిర్మిలమైన మనసులో ప్రతిఒక్కరితో మమేకం కావాలనే పాయింట్ ను ఈ చిత్రంలో చెబుతున్నామనీ, మంచి ప్రేమకథ కూడా ఇందులో మిళితమై ఉంటుందనీ దర్శకుడు తెలిపారు. ఇటీవల రెండు పాటలను చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తయిందనీ, వీటిని అరకు, విశాఖ లొకేషన్లలో తీశామనీ చెప్పారు. ఈ చిత్రంలో 7 పాటలు ఉన్నాయనీ, డిసెంబర్ మొదటివారంలో ఆడియో విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నరేష్, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ నారాయణ, ఆర్.కె., ప్రగతి, విజయ్ తదితరులు నటించారు. చైతన్య ప్రసాద్ పాటలు, జె.కె.గుమ్మడి సినిమాటోగ్రఫీ, అనూప్ సంగీతం అందించారు.

No comments:

Post a Comment