రామ్ గోపాల్ వర్మ 'జేమ్స్' తర్వాత మళ్లీ చాలా కాలానికి విజయవాడలో 'ప్రస్థానం' చిత్రం ఆడియో విడుదల కానుంది. శర్వానంద్, రూబి (తొలిపరిచయం) జంటగా దేవ్ కట్టా ('వెన్నెల' ఫేమ్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. వి.ఆర్.సి.మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రవి వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టింది'గమ్యం' చిత్రం తర్వాత తాను గర్వించే చిత్రంగా 'ప్రస్థానం' ఉంటుందనీ, చక్కటి కథ కథనాలతో మంచి టీమ్ తో రూపొందిన చిత్రమిదనీ శర్వానంద్ చెబుతున్నారు. ఈ చిత్రంలోని కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను ఇటీవల విజయవాడలో తీశారు. మహేష్ శంకర్ సంగీతం అందించిన పాటలు ఎంతో వైవిధ్యంగా ఉనంటాయనీ, వనమాలి, చైతన్య ప్రసాద్ చక్కటి సాహిత్యం అందించారనీ, 'వెన్నెల' కంటే ఈ చిత్రం ఆడియో మరింత ఆకట్టుకుంటుదనీ దర్శకుడు దేవ్ కట్టా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 27న విజయవాడలోని ఎస్ఆర్ కె కాలేజీ గ్రౌండ్స్ లో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సాయికుమార్, సందీప్ కిషన్, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం దైవ్ కట్టా అందించిన ఈ చిత్రానికి శామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించారు. వల్లభనేని రోశయ్య సమర్పకులుగా వ్యవహరించారు.
No comments:
Post a Comment