'వా' ఆడియో విడుదల

బాబుగణేష్ కథానాయకుడుగా స్వీయనిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'వా'. కృష్ణభగవాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. గంగోత్రి ఫిలిం టీవీ ఇంటర్నేషనల్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ఫిలించాంబర్ లో జరిగింది. నటుడు కృష్ణ భగవాన్ ఆడియో సీడీలను ఆవిష్కరించి చిత్ర నటీమణులు తేజశ్రీ, మాధవి, అనితకు అందజేశారు.
తెలుగులో సినిమా చేయమని బాబుగణేష్ ను ఆయన తల్లి కోరడంతో ఈ చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నారని కృష్ణభగవాన్ తెలిపారు. ఈ చిత్రంలోని 14 శాఖలను బాబుగణేష్ చేపట్టడం ఓ విశేషమని అన్నారు. ఇందులో తాను తాతగా, మనువడుగా నటించినట్టు చెప్పారు. బాబుగణేష్ మాట్లాడుతూ, తమిళలో పది చిత్రాలు చేశాననీ, తన తల్లి కోరిక మేరకు ఈ 11వ చిత్రం తీశానని చెప్పారు. ఇదే వేదిక నుంచి ఐదుగురు పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. ఈ వేడుకలో పొట్టి రాంబాబు, మధుర ఆడియోస్ కు చెందిన లక్ష్మీనారాయణ తదితురలు పాల్గొన్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా ఆడియో విడుదలైంది.

No comments:

Post a Comment