నమితతో 'ఇద్దరు మొనగాళ్లు'

నమిత బార్ డాన్సర్ గా, మలయాళ నటుడు కళాభవన్ మణి క్రిమిషన్ పోలీసు అధికారిగా నటిస్తున్న చిత్రం 'ఇద్దరు మొనగాళ్లు'. బాల, జూలియా ముఖ్య పాత్రలను పోషించారు. ఓ యదార్ధ యదార్ధ సంధటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ప్రమోద్ పప్పన్ దర్శకత్వంలో జగదీష్ చంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.ఈ చిత్ర విశేషాలను నిర్మాత జగదీష్ చంద్రన్ తెలియజేస్తూ, తాను గతంలో 20కి పైగా మలయాళ చిత్రాలను నిర్మించాననీ, తొలిసారిగా 'ఇద్దరు మొనగాళ్లు' చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందించామనీ చెప్పారు. నగరంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారనీ, యాక్షన్, సెంటిమెంట్, గ్లామర్ వంటి అన్ని అంశాలతో అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఇందులో ఐదు పాటలు ఉన్నాయనీ, వీటికి వెన్నెలకంటి, పొందూరి సాహిత్యం, అభిషేక్ సంగీతం అందించారని చెప్పారు. మంచి లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరిగిందనీ, వీటిలో నమిత చేసిన ఐటెం సాంగ్ హైలైట్ అవుతుందనీ అన్నారు. అలాగే సినిమాలో మాఫియా శశి కంపోజ్ చేసిన ఐదు ఫైట్స్ చాలా బాగా వచ్చాయన్నారు. తెలుగు వెర్షన్ షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో జరిపినట్టు చెప్పారు. నమిత గ్లామర్ పాత్రలోనూ, బాల గ్లామర్ బాయ్ గానూ, జూలియా అవిటి పాత్రలోనూ పోటీపడి నటించినట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, రాజన్ పి.దేవ్, సి.ఆర్.మనోహర్, రామరాజు, పవన్ తదితరులు నటించారు. రాజశేఖర్ రెడ్డి మాటలు, ప్రమోద్ సినిమాటోగ్రఫీ అందించారు.

No comments:

Post a Comment