దిల్ రాజుకు నైజాం సారాయి

గట్స్ ఉన్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు మంచి పేరుంది. దిల్ రాజు నుంచి ఒక సినిమా వస్తోందన్నా, ఆయన బయట చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారన్నా సహజంగానే ఆ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ప్రమోషన్ వర్క్ పరంగా ఆయన అనుసరించే వ్యూహాలే ఇందుకు కారణం. ఇటీవల కాలంలో ఆయన నిర్మించిన 'జోష్', పంపిణీ చేసిన 'మల్లన్న' వంటి చిత్రాలు చేదు అనుభవాలను చవిచూసినా దిల్ రాజు మరోసారి తన గట్స్ ను చాటుకుంటున్నారు. ప్రస్తుతం వరుణ్ సందేష్ తో 'మరోచరిత్ర', రామ్ తో 'రామరామ కృష్ణకృష్ణ', ఎన్టీఆర్ 'బృందావనం' వంటి ప్రిస్టేజియస్ చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. తాజాగా ఆయన అజయ్ కథానాయకుడుగా విడుదలకు సిద్ధమవుతున్న 'సారాయి వీర్రాజు' చిత్రం నైజాం, వైజాగ్ ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.విశాలాక్ష్మి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పి.ఆర్.కె.రావు 'సారాయి వీర్రాజు' చిత్రాన్ని నిర్మించారు. రాజమౌళి, క్రిష్ వంటి దర్శకుల వద్ద పనిచేసిన డి.ఎస్.కణ్ణన్ తొలిసారి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రమ్య నంబిసన్ హీరోయిన్ గా (తొలిపరిచయం) నటిస్తోంది. సహజత్వానికి దగ్గరగా రూపొందిన ఈ చిత్రం పబ్సిసిటీ స్టిల్స్, ఆడియో పరంగా మంచి అంచనాలనే రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు రెండు ప్రధాన ఏరియాల హక్కులను తీసుకోవడం కూడా ఆ అంచనాలను మరించ పెంచుతోంది. ఈనెల 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది

No comments:

Post a Comment