బిగ్' టికెట్ ప్రీమియర్...

కృష్ణుడు కథానాయకుడుగా రూపొందిన 'విలేజ్ లో వినాయకుడు' చిత్రం బిగ్-టికెట్ ప్రీమియర్ బుధవారం రాత్రి 9.45 గంటలకు అమీర్ పేటలోని బిగ్ సినిమాస్ లో ప్రదర్శించనున్నారు. థియేటర్ లోని అన్ని స్క్రీన్స్ ను నిర్మాత మహి బుక్ చేశారు. ఈ రెడ్ కార్పెట్ ప్రీమియర్ ను టీవీ-9 లైఫ్ ఇస్తుంది. ఈ ప్రీమీయర్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఒక ఉదాత్తమైన కార్యక్రమానికి నిర్మాత అందజేయబోతున్నారు.

ఈ ఏడాదిలోనే అతి తక్కువ బడ్జెట్ తో (దాదాపు 1.5 కోట్లు) రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ అందుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఏడాదిలో అత్యధిక అమ్మకాలు జరిగిన ఆడియో ఆల్బమ్ గా కూడా ఈ చిత్రం ఇప్పటికే రికార్డు సృష్టించినట్టు నిర్మాతలు చెబుతున్నారు. డి.సురేష్ బాబుకు చెందిన సురేష్ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈచిత్రం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం యుఎస్ఎ డిస్ట్రిబ్యూషన్ హక్కులను నటుడు వరుణ్ సందేశ్ తండ్రి విజయ్ సారథి జీడిగుండ్ల సొంతం చేసుకున్నారు. కృష్ణుడు-శరణ్య మోహన్ జంటగా నటించిన ఈ చిత్రానికి సాయి కరణ్ అడవి దర్శకత్వం వహించారు. కృష్ణుడు హీరోగా ఆయన దర్శకత్వంలోనే విడుదలైన విజయవంతమైన 'వినాయకుడు' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ గురువారమే 'విలేజ్ లో వినాయకుడు' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

No comments:

Post a Comment