ప్రణయ్, రాఖీసేన్ హీరోహీరోయిన్లుగా డాక్టర్ ఎ.చంద్రశేఖర్ (మాజీమంత్రి) సమర్పణలో ఎమ్.రాజ్ కుమార్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'నైన్త్ క్లాస్ కేరాప్ ఏలేశ్వరం'. పి.రామకృష్ణ గౌడ్ దర్శకుడు. ఈ చిత్రం 30 శాతం టాకీ పూర్తి చేసుకుని ఈనెల మూడోవారం నుంచి హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.హైద్రాబాద్ లో జరుపనున్న షెడ్యూల్ లో హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటుందని ఎమ్.రాజ్ కుమార్ తెలిపారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయనీ, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నారనీ చెప్పారు. త్వరలోనే పాటల రికార్డింగ్ పూర్తి చేసి డిసెంబర్ చివరి వారం నుంచి జరిగే మూడో షెడ్యూల్ లో పాటల చిత్రీకరణ జరుపుతామని నిర్మాత రాజ్ కుమార్ తెలిపారు. సమాజంలో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యక్రమాల దుష్ట్రభావం విద్యార్థులపై పడకుండా ఉండాలనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అనీ, ప్రణయ్, రాఖీసైన్ లు కొత్త వాళ్లయినా చక్కగా నటిస్తున్నారనీ దర్శకుడు రామకృష్ణ గౌడ్ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, నాజర్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్, జీవా, మాస్టర్ భరత్, నరసింగ్ యాదవ్, ముమైత్ ఖాన్, సన, హేమ, జయలలిత, గీతాసింగ్ తదితరులు నటిస్తున్నారు. మిడిదొడ్డి బ్రదర్స్ కథ, రవిప్రసాద్ మాటలు, సిరివెన్నెల-చంద్రబోస్ పాటలు, మోహన్ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు9th క్లాస్ c/o ఏలేశ్వరం
ప్రణయ్, రాఖీసేన్ హీరోహీరోయిన్లుగా డాక్టర్ ఎ.చంద్రశేఖర్ (మాజీమంత్రి) సమర్పణలో ఎమ్.రాజ్ కుమార్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం 'నైన్త్ క్లాస్ కేరాప్ ఏలేశ్వరం'. పి.రామకృష్ణ గౌడ్ దర్శకుడు. ఈ చిత్రం 30 శాతం టాకీ పూర్తి చేసుకుని ఈనెల మూడోవారం నుంచి హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ కు రెడీ అవుతోంది. ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.హైద్రాబాద్ లో జరుపనున్న షెడ్యూల్ లో హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటుందని ఎమ్.రాజ్ కుమార్ తెలిపారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయనీ, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నారనీ చెప్పారు. త్వరలోనే పాటల రికార్డింగ్ పూర్తి చేసి డిసెంబర్ చివరి వారం నుంచి జరిగే మూడో షెడ్యూల్ లో పాటల చిత్రీకరణ జరుపుతామని నిర్మాత రాజ్ కుమార్ తెలిపారు. సమాజంలో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యక్రమాల దుష్ట్రభావం విద్యార్థులపై పడకుండా ఉండాలనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అనీ, ప్రణయ్, రాఖీసైన్ లు కొత్త వాళ్లయినా చక్కగా నటిస్తున్నారనీ దర్శకుడు రామకృష్ణ గౌడ్ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, నాజర్, సాయాజీ షిండే, బ్రహ్మానందం, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, వేణుమాధవ్, జీవా, మాస్టర్ భరత్, నరసింగ్ యాదవ్, ముమైత్ ఖాన్, సన, హేమ, జయలలిత, గీతాసింగ్ తదితరులు నటిస్తున్నారు. మిడిదొడ్డి బ్రదర్స్ కథ, రవిప్రసాద్ మాటలు, సిరివెన్నెల-చంద్రబోస్ పాటలు, మోహన్ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment