నితిన్, హన్సిక మోత్వాని జంటగా నటిస్తున్న చిత్రం 'సీతారాముల కల్యాణం'. దీనికి 'లంకలో' అనే ఉపశీర్షిక ఉంది. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ మళ్ల విజయప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ రెడ్డి దర్శకుడు. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ స్పాట్ లోనే చిత్రయూనిట్ ఆ విశేషాలను తెలియజేసింది.నితిన్ మాట్లాడుతూ, ఇదొక క్లీన్ కామెడీ ఎంటర్ టైనర్ అనీ, టైటిల్ దగ్గర్నించీ ఈ చిత్రంలో నవ్యత చూపించాలనే ప్రయత్నం చేశామనీ, దర్శకుడు ఈ చిత్రాన్ని సమర్ధవంతంగా డీల్ చేస్తున్నారనీ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ, గతంలో తాము తీసిన 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' మంచి పేరు తెచ్చిందనీ, ఈ చిత్రానికి మంచి టైటిల్ కుదిరందనీ చెప్పారు. నవరసాలతో చక్కటి ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని, అనూప్ రూబెన్ సంగీతం అందర్నీ అలరిస్తుందనీ అన్నారు. ఈనెల 18 వరకూ జరిగే షూటింగ్ తో టాకీ పూర్తవుతుందని చెప్పారు. మిగిలిన రెండు పాటలను త్వరలోనే పూర్తి చేసి డిసెంబర్ 19న వైజాగ్ లో ఆడియో, జనవరి 8 సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ, ఇది వినోదాత్మక ప్రేమకథా చిత్రమనీ, నితిన్ ఈ చిత్రంతో టాప్ స్టార్ అవుతాడనీ అన్నారు. మంచి టీమ్ తో చేస్తున్న ఈ చిత్రం అందరికీ మంచి సినిమా అవుతుందని హన్సిక ఆశాభావం వ్యక్తం చేసింది.
No comments:
Post a Comment