విలేజ్ లో వినాయకుడు' 5న

కృష్ణుడు, శరణ్య హీరోహీరోయిన్లుగా మూన్ వాటర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మహి నిర్మిస్తున్న చిత్రం 'విలేజ్ లో వినాయకుడు'. సాయికిరణ్ అడవి దర్శకుడు. కృష్ణుడు హీరోగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలోనే గతంలో విడుదలై కమర్షియల్ సక్సెస్ తో పాటు నంది అవార్డులు కూడా గెలుచుకున్న 'వినాయకుడు' చిత్రానికి ఇది సీక్వెల్. ఇటీవలే ఆడియో పరంగా సంచలన అమ్మకాలు సాధించడంతో చిత్ర యూనిట్ ఆంద్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో విజయయాత్రను కూడా నిర్వహించింది. ఈనెల 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఇటీవల తాము విజయయాత్ర నిర్వహించి ప్రజలను నేరుగా కలిశామనీ, ఆడియో చాలా బాగుందనీ అందరూ ప్రశంసించారనీ సాయికిరణ్ అడవి తెలిపారు. ఆడియో సక్సెస్ తో సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే గట్టి నమ్మకం తమకు ఉందని అన్నారు. ఐడియాలో పెద్దది...బడ్జెట్ పరంగా చిన్నదిగా ఈ చిత్రం రూపొందటం రికార్డని నిర్మాత మహి తెలిపారు. 'వినాయకుడు' చిత్రానికి 2.4 కోట్లు ఖర్చు కాగా, 1.38 కోట్లతో 'విలేజ్ లో వినాయకుడు' పూర్తయిందని, ఈ ఏడాదిలో అతి తక్కువ బడ్జెట్ తో పూర్తయిన చిత్రంగా ఇదో రికార్డు కానుందని అన్నారు. క్వాలిటీ విషయంలో రాజీపడకుండా దృశ్యపర్వంగా సినిమా తెరకెక్కిందన్నారు. ఎక్కువ మంది మీడియా పార్టనర్స్ ఉండటం కూడా ఈ చిత్రానికి మరో రికార్డని అన్నారు. ఈ నెల 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, మరో కీలక పాత్రను రావు రమేష్ పోషించారు. ఈ చిత్రానకి మహి కథ, వనమాలి పాటలు, రమణ సాల్వా సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఖాద్రి సంగీతం అందించారు.

No comments:

Post a Comment