అజయ్, రమ్య నంబిసన్, మధులిక హీరోహీరోయిన్లుగా విశాలాక్ష్మి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పి.ఆర్.కె.రావు నిర్మించిన చిత్రం 'సారాయి వీర్రాజు'. డి.ఎస్.కణ్ణన్ దర్శకుడు. ఈనెల 27న ఈ చిత్రం విడుదలవుతోందని హీరో అజయ్ తెలిపారు. సంస్థ కార్యాలయంలో గురువారంనాడు ఆ వివరాలను చిత్రయూనిట్ తెలియజేసింది.దర్శకుడు కణ్ణన్ మాట్లాడుతూ, మంచి ఫీల్ ఉన్న చిత్రమిదనీ, ఇందులోని 90 శాతం ఆర్టిస్టులు కొత్తవారనీ, సినిమా చాలా బాగా వచ్చిందనీ చెప్పారు. ఇటీవలే తొలికాపీ వచ్చిందనీ, సెన్సార్ కూడా పూర్తయిందనీ చెప్పారు. ఇందులో చాలా స్వార్థంగా ఆలోచించే పాత్ర తనదనీ, తన పాత్రలో మంచి ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉంటుందనీ చెప్పారు. లాభనష్టాల ప్రమేయం లేకుండా అర్ధవంతమైన సినిమాలు తీయాలన్నదే తమ సంస్థ ఉద్దేశమనీ విశాలాక్షి క్రియేషన్స్ ప్రతినిధి సుధీర్ చెప్పారు. చక్కటి కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. ఈ చిత్రంలో తాను నటించిన ప్రీతి పాత్రకు మంచిపేరు వస్తుందని మధులిక తెలిపింది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జోగినాయుడు, ధనరాజ్, సత్తన్న, అజయ్ ఘోష్, ముమైత్ ఖాన్ తదితరులు నటించారు. విశ్వ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, శ్రీసాయి సంగీతం అందించారు.
No comments:
Post a Comment