2012లో ప్రపంచం వినాశనమవుతుందా? యుగాంతం నిజమేనా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. ఇదే కాన్సెప్ట్ తో ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన '2012 యుగాంతం' చిత్రం హవా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బలంగా వీస్తోంది. అప్పట్లో 'జురాసిక్ పార్క్', 'టైటానిక్' చిత్రాల తర్వాత ఆ స్థాయిలో ఏ ఆంగ్ల చిత్రం తెలుగులో ఆదరణ పొందలేదు. ఇప్పుడు '2012' చిత్రం తెలుగు స్ట్రయిట్ చిత్రాలకు ధీటుగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రోలాండ్ ఎమరిక్ ('గాడ్జిల్లా', '10000 బిసి' ఫేమ్) ఈ చిత్రాన్ని రూపొందించారు. 200 మిలియన్ డాలర్ల (980 కోట్లు) భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందింది. కొలంబియా పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్.జి.ప్రొడక్షన్ సంస్థ అందించింది.ఆంధ్రప్రదేశ్ లో ఒక హాలీవుడ్ చిత్రానికి వచ్చిన ఓపినింగ్స్ పరంగా 2012 సరికొత్త రికార్డును సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ఒక్క హైద్రాబాద్ లోనే తెలుగు వెర్షన్ 11 థియేటర్లు, ఆంగ్ల-హిందీ వెర్షన్లు చెరో 8 థియేటర్లలో విడుదల చేశారు. తొలివారంలో అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ కావడంతో ఈ చిత్రం రానున్న రోజుల్లో మరింత పెద్ద సక్సెస్ కు సాధించడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ ఆంగ్ల చిత్రానికి రానంత ఓపినింగ్స్ ఈ చిత్రం రాబట్టుకుందనీ, ఏ తెలుగు స్టార్ హీరో సినిమా ఓపినింగ్స్ కూ ఇది తక్కువ కాదనీ వారంటున్నారు. 2012లో యుంగాంతం కానుందంటూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, ఫిల్మ్ మేకర్స్ ఇచ్చిన పబ్లిసిటీ ఈ చిత్రానికి భారీ ఓపినింగ్స్ కు రాబట్టుకుని పెద్ద హిట్ నమోదు చేసుకోనుందని వారు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు భూమి బద్దలైపోతూ భవంతులు కూలిపోవడం, మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన సునామీ వాటిని తనలో కలుపుకొనే సన్నివేశాలు, అగ్నిపర్వతాలు బద్దలై పొంగే లావా సన్నివేశాలు వెండితెరపై ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను థియేటర్ల వైపు క్యూలు కట్టిస్తున్నాయి. ఈ టాక్ మరింత స్ప్రెడ్ అవుతుండంతో మునుముందు కలెక్షన్ల పరంగా మరింత సంచలనం ఖాయమని ఎల్.జి.ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన బి.సుబ్రమణ్యం ధీమా వ్యక్తం చేశారు.'2012'తో బాక్సాఫీస్ షేక్!
2012లో ప్రపంచం వినాశనమవుతుందా? యుగాంతం నిజమేనా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. ఇదే కాన్సెప్ట్ తో ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన '2012 యుగాంతం' చిత్రం హవా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బలంగా వీస్తోంది. అప్పట్లో 'జురాసిక్ పార్క్', 'టైటానిక్' చిత్రాల తర్వాత ఆ స్థాయిలో ఏ ఆంగ్ల చిత్రం తెలుగులో ఆదరణ పొందలేదు. ఇప్పుడు '2012' చిత్రం తెలుగు స్ట్రయిట్ చిత్రాలకు ధీటుగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రోలాండ్ ఎమరిక్ ('గాడ్జిల్లా', '10000 బిసి' ఫేమ్) ఈ చిత్రాన్ని రూపొందించారు. 200 మిలియన్ డాలర్ల (980 కోట్లు) భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందింది. కొలంబియా పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎల్.జి.ప్రొడక్షన్ సంస్థ అందించింది.ఆంధ్రప్రదేశ్ లో ఒక హాలీవుడ్ చిత్రానికి వచ్చిన ఓపినింగ్స్ పరంగా 2012 సరికొత్త రికార్డును సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ఒక్క హైద్రాబాద్ లోనే తెలుగు వెర్షన్ 11 థియేటర్లు, ఆంగ్ల-హిందీ వెర్షన్లు చెరో 8 థియేటర్లలో విడుదల చేశారు. తొలివారంలో అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ కావడంతో ఈ చిత్రం రానున్న రోజుల్లో మరింత పెద్ద సక్సెస్ కు సాధించడం ఖాయమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏ ఆంగ్ల చిత్రానికి రానంత ఓపినింగ్స్ ఈ చిత్రం రాబట్టుకుందనీ, ఏ తెలుగు స్టార్ హీరో సినిమా ఓపినింగ్స్ కూ ఇది తక్కువ కాదనీ వారంటున్నారు. 2012లో యుంగాంతం కానుందంటూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, ఫిల్మ్ మేకర్స్ ఇచ్చిన పబ్లిసిటీ ఈ చిత్రానికి భారీ ఓపినింగ్స్ కు రాబట్టుకుని పెద్ద హిట్ నమోదు చేసుకోనుందని వారు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు భూమి బద్దలైపోతూ భవంతులు కూలిపోవడం, మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన సునామీ వాటిని తనలో కలుపుకొనే సన్నివేశాలు, అగ్నిపర్వతాలు బద్దలై పొంగే లావా సన్నివేశాలు వెండితెరపై ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను థియేటర్ల వైపు క్యూలు కట్టిస్తున్నాయి. ఈ టాక్ మరింత స్ప్రెడ్ అవుతుండంతో మునుముందు కలెక్షన్ల పరంగా మరింత సంచలనం ఖాయమని ఎల్.జి.ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరైన బి.సుబ్రమణ్యం ధీమా వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment