'ఆర్య-2' 27కు వాయిదా?

ఏడాది పాటు చిత్రిక పట్టి సుకుమార్ తెరకెక్కించిన 'ఆర్య-2' చిత్రం రిలీజ్ పరంగానూ 'లేట్ కమర్' కాబోతోంది. 'పరుగు' తర్వాత మళ్లీ స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చివరి నిమిషంలోనూ మరింత నిరీక్షణ తప్పలాలేదు. ఈ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆదిత్య బాబు ఇటీవల ప్రకటించారు. దీంతో 'ఆర్య-2' రిలీజ్ ఎప్పుడనే సస్పెన్స్ కు తెరపడినట్టయింది. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా అనుమానంగానే మారింది. తాజా సమాచారం ప్రకారం ఈనెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
ఇటీవల కాలంలో రిలీజ్ తేదీలు ప్రకటించిన తర్వాత కూడా లేట్ రిలీజ్ కావడం సర్వసాధారణ విషయంగా మారుతోంది. 'అరుంధతి', 'జోష్' చిత్రాలు ప్రకటించిన తేదీకి రెండ్రోజులు ఆలస్యంగా రిలీజ్ అయ్యారు. మొదటి చిత్రం బాక్సాఫీస్ హిట్ ను, మలి చిత్రం ఫెయిల్ ను చవిచూశాయి. తాజాగా 'ఆర్య-2' సైతం 27వ తేదీకి జరిగిందనీ, అయితే ఇంకెంతమాత్రం పోస్ట్ పోన్ ఉండదనీ ఇండస్ట్రీ వర్గాల చెబుతున్నాయి. 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్, నవదీప్, శ్రద్దాదాస్, తమిళ నటుడు ఆర్య విలన్ గా నటించారు. దేవీశ్రీప్రాసద్ సంగీతం అందించారు

No comments:

Post a Comment