'ఆ ఒక్కడు' చిత్రం తర్వాత అజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'సారాయి వీర్రాజు'. విశాలాక్షి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పి.ఆర్.కె.రావు నిర్మించిన ఈ చిత్రానికి డి.ఎస్.కణ్ణన్ దర్శకుడు. రావిశాస్త్రి రచించిన 'ఆరు సారా కథలు' ఆధారంగా రూపొందించిన చిత్రమిది. రమ్య నంబిసన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈనెల 19న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.కణ్ణన్ మాట్లాడుతూ, సారాయి అమ్మడంలోనే కాకుండా తాగడంలోనూ వీర్రాజు ముందుంచాడనీ, దాంతో అందరూ అతని పేరు ముందు సారాయి తగిలించి సారాయి వీర్రాజుగా పిలుస్తుంటారనీ, అతని జీవితంలో ఓ అమ్మాయి ప్రవేశించడంతో కథ మలుపు తిరుగుతుందనీ అన్నారు. ఆసక్తికరమైన కథా కథనాలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు చెప్పారు. ఈ చిత్రం అన్ని వర్గాలను అలరించేవిధంగా ఉంటుందని నిర్మాత పరుచూరి రామ కోటేశ్వరరావు తెలిపారు. సహజత్వానికి చాలా దగ్గరగా ఈ చిత్రం ఉంటుందనీ, అజయ్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందనీ చెప్పారు. హైద్రాబాద్, చెన్నై, నర్సీపట్నం, దుబాయ్ లలో షూటింగ్ జరిపామనీ, రియాలిటీ కోసం నర్సీపట్నాకి చెందిన 180 మందిని ఇందులో నటింపజేశామనీ చెప్పారు. ఈనెల 19న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. మధులిక, జోగినాయుడు, ధనరాజ్, సత్తెన్న, అజయ్ ఘోష్, ముమైత్ ఖాన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. విశ్వ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంటటేశ్వరరావు ఎడిటింగ్, శ్రీసాయి సంగీతం అందించారు'సారాయి వీర్రాజు' 19న
'ఆ ఒక్కడు' చిత్రం తర్వాత అజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'సారాయి వీర్రాజు'. విశాలాక్షి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పి.ఆర్.కె.రావు నిర్మించిన ఈ చిత్రానికి డి.ఎస్.కణ్ణన్ దర్శకుడు. రావిశాస్త్రి రచించిన 'ఆరు సారా కథలు' ఆధారంగా రూపొందించిన చిత్రమిది. రమ్య నంబిసన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈనెల 19న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.కణ్ణన్ మాట్లాడుతూ, సారాయి అమ్మడంలోనే కాకుండా తాగడంలోనూ వీర్రాజు ముందుంచాడనీ, దాంతో అందరూ అతని పేరు ముందు సారాయి తగిలించి సారాయి వీర్రాజుగా పిలుస్తుంటారనీ, అతని జీవితంలో ఓ అమ్మాయి ప్రవేశించడంతో కథ మలుపు తిరుగుతుందనీ అన్నారు. ఆసక్తికరమైన కథా కథనాలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు చెప్పారు. ఈ చిత్రం అన్ని వర్గాలను అలరించేవిధంగా ఉంటుందని నిర్మాత పరుచూరి రామ కోటేశ్వరరావు తెలిపారు. సహజత్వానికి చాలా దగ్గరగా ఈ చిత్రం ఉంటుందనీ, అజయ్ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందనీ చెప్పారు. హైద్రాబాద్, చెన్నై, నర్సీపట్నం, దుబాయ్ లలో షూటింగ్ జరిపామనీ, రియాలిటీ కోసం నర్సీపట్నాకి చెందిన 180 మందిని ఇందులో నటింపజేశామనీ చెప్పారు. ఈనెల 19న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. మధులిక, జోగినాయుడు, ధనరాజ్, సత్తెన్న, అజయ్ ఘోష్, ముమైత్ ఖాన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. విశ్వ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంటటేశ్వరరావు ఎడిటింగ్, శ్రీసాయి సంగీతం అందించారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment