ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలను అతలాకుతలం చేసిన వరదల్లో బాధితులైన వారిని ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున ఇటీవల 'స్టార్ నైట్' నిర్వహించి 5 కోట్ల వరకూ ముఖ్యమంత్రి సహాయనిధికి అదించింది. ఇందులో తమిళ స్టార్ హీరోలు సైతం పలువురు పాల్గొని యథాశక్తి విరాళాలు అందజేశారు కూడా. తన బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఈ స్టార్ నైట్ కు హాజరుకాలేకపోయిన ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ ఆదివారంనాడు నేరుగా ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలిసి 15 లక్షల రూపాయలు విరాళం చెక్కురూపంలో అందజేశారు.విక్రమ్ మాట్లాడుతూ, కాశ్మీర్ లో సెల్వరాఘువన్ సినిమా షూటింగ్ లో తాను ఉన్నందున స్టార్ నైట్ కు రాలేకపోయాయనీ, తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగువారి కోసం ఏదైనా చేయాలనే గట్టి తలంపులో కాశ్మీర్ షెడ్యూల్ పూర్తికాగానే నేరుగా హైదరాబాద్ వచ్చి సిఎం ను కలిసి చెక్ అందించాననీ చెప్పారు. తమిళ పరిశ్రమకు చెందిన హీరో సూర్య ఇటీవల 10 లక్షల రూపాయలు, విజయ్ 5 లక్షలు, విశాల్ 2.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు
No comments:
Post a Comment