'కాసుకో' ఆడియో 14న

వైభవ్, శ్వేతబసు ప్రసాద్ జంటగా కె.ఫిలిమ్స్ బ్యానర్ పై ఎ.కోదండరామిరెడ్డి సమర్పణలో ఎ.భారతి నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'కాసుకో'. జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈనెల 14న ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తున్నట్టు కోదండరామిరెడ్డి తెలిపారు.లవ్, యాక్షన్ వంటి అంశాలను మేళవించి దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారనీ, హైద్రాబాద్, వైజాగ్ లలో షూటింగ్ జరిపామనీ కోదండరామిరెడ్డి చెప్పారు. వైభవ్ ఈ చిత్రంలో మంచి నటనతో పాటు ఫైట్స్ లో నూ చక్కటి ప్రతిభ చూపారనీ, శ్వేతబసు ప్రసాద్ గ్లామర్ తో కూడిన మంచి నటన ప్రదర్శించిందనీ చెప్పారు. మరో పాత్రలో గౌరీ పండిట్ నటించిందని చెప్పారు. ప్రేమ్ జీ సంగీతం అందించిన పాటలు చాలా బాగా వచ్చాయనీ, అలాగే గోపీ మోహన్ స్క్రీన్ ప్లే, రవి సంభాషణలు సినిమాకి హైలైట్స్ కానున్నాయని చెప్పారు. వైభవ్ కు ఈ చిత్రంతో హీరోగా మంచి బ్రేక్ వస్తుందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, సలీమ్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, ఆజాద్ తదితరులు నటించారు.

No comments:

Post a Comment