ఎక్కువ డౌన్ లోడ్ లు, రింగ్ టోన్ లతో జనాలకు దగ్గరైన పాటలపై నిర్మాతలు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఆ పాటల పల్లవులను తమ సినిమాలకు టైటిల్స్ గా ఎంపిక చేసుకుంటారు. 'గోపి గోపిక గోదావరి' చిత్రంలో చక్రి స్వరపరచిన 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' పాట ఈ ఏడాది టాప్-10 సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఉదయ్ కిరణ్, శ్వేతాబసు ప్రసాద్ జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రానికి 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' అనే టైటిల్ ను ఖారారు చేశారు. యుకె ఎవెన్యూస్ పి.ఉదయ్ కిరణ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి పతాకంపై డి.కుమార్, ఈశ్వర వరప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుభాసెల్వం దర్శకుడు.వైవిధ్యమైన ప్రేమకథా ఇతివృత్తంతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైద్రాబాద్, రెండో షెడ్యూల్ పాండిచ్చేరి, చైన్నైలలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటూ చివరి షెడ్యూల్ ను హైద్రాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం మళ్లీ ఉదయ్ కిరణ్ కు సరైన బ్రేక్ ఇస్తుందనీ, శ్వేతబసు ప్రసాద్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనీ చిత్రయూనిట్ చెబుతోంది. ఆశిష్ విద్యార్థి, నళిని, రాజ్యలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జనార్ధన మహర్షి-నివాస్ రచన, రాఘవన్ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, ప్రదీప్ కోనేరు సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment