2009: అడ్రస్ గల్లంతు

హీరోలంటే వెండితెర వేల్పులుగా ఆరాధించే సినీ అభిమానులు వారి నుండి ఏడాదికి రెండు మూడు కాకపోయినా కనీసం ఒక్క సినిమా వచ్చినా తృప్తిపడి సంబరాలు జరుపుకొంటారు. అయితే అభిమానుల ఆశలకు తగ్గట్టుగా స్టార్ హీరోలు కొందరు తమ పద్దతి మార్చుకోని పరిస్థితి కొన్నేళ్లుగా ఉంది. ఇప్పడిప్పుడే పెద్ద హీరోలతో పాటు, కుర్ర స్టార్ హీరోలు సైతం ఏడాదికి కనీసం రెండు సినిమాల్లో అయినా కనిపిస్తామంటూ తమ ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ట్రాక్ మీద రావడానికి మరికొంత సమయం పట్టక తప్పేలా లేదు. ఈ ఏడాది నలుగురు స్టార్ హీరోలు తమ కొత్త సినిమాల ఖాతా తెరవలేదు. వీరిలో పవన్ కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్ తో పాటు నాగార్జున కూడా ఉన్నారు. ఈ నలుగురిలో కూడా మహేష్ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది.'పోకిరి' సినిమాతో 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన మహేష్ బాబు చివరిసారిగా 18 అక్టోబర్ 2007న 'అతిథి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఫెయిల్ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్న మహేష్ ఇంతవరకూ మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. శింగనమల రమేష్ నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ప్రస్తుతం ప్రోగ్రస్ లో ఉంది. ఇటీవల వికారాబాద్ లో చివరి షెడ్యూల్ సందర్భంగా కోటిన్నర రూపాయల సెట్ కు తెలంగాణ ఉద్యమకారులు నిప్పు పెట్టడంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ దశలో వచ్చే ఏడాది ప్రథమార్థంలో కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా మహేష్ 'జోరో' ఖాతా కంటిన్యూ చేస్తున్నారు.

No comments:

Post a Comment