అందం, నటన సమపాళ్లలో ఉన్న జెనీలియా తెలుగులోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ లోనూ చక్కటి విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ అవుతోంది. తొలినాళ్లలో బాలీవుడ్ లో నటించి, ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆలస్యంగానే గుర్తింపు వచ్చింది. 'బొమ్మరిల్లు' చిత్రంలో హాసినిగా ఆమె నటన యువ హృదయాలను ఆకట్టుకోవడం ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. బాలీవుడ్ లోనూ ఇటీవల 'జానే తు య జానే' చిత్రం ఆమెకు సరైన బ్రేక్ నిచ్చింది. 2009 సంవత్సరం తనకు ఎంతో కలిసి వచ్చిందని చెబుతున్న జెనీలియా న్యూ ఇయర్ వైపు కూడా ఎంతో ఆశావహ దృక్పథంతో చూస్తోంది. సహజంగా నటీనటులు కొత్త సంవత్సరంలో విదేశాలకో, గోవా లాంటి సుందర ప్రదేశాలకో వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. జెనీలియా మాత్రం నాసిక్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అక్కడి చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరుపబోతోంది.నాసిక్ లోని చర్చి అంటే తనకూ, తన కుటుంబ సభ్యులకూ ఎంతో నమ్మకం ఉందనీ, కొత్త సంవత్సరం శుభం జరగాలని కోరుకుంటూ చర్చికి వెళ్తున్నాననీ జెనీలియా చెప్పుకొచ్చింది. కెరీర్ పరంగా 2009 తనకు బాగా గుర్తుండిపోయే సంవత్సరమనీ, భగవంతుడి అనుగ్రహమే ఇందుకు కారణమనీ ఆమె అంటోంది. ప్రస్తుతం జెనీలియా హిందీలో రెండు, తెలుగులో ఒక చిత్రంలో నటిస్తోంది. సాహిద్ కపూర్ సరసన నటించిన 'ఛాన్స్ పే డాన్స్' విడుదలకు సిద్ధంగా ఉండగా, దీని వెనుకే డేవిడ్ ధావన్ 'హుక్ య క్రూక్' విడుదలవుతుంది. ఇందులో జాన్ అబ్రహంకు జోడిగా జెనీలియా నటిస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరనన నటిస్తున్న 'ఆరంజ్' చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వచ్చిందిజెనీలియా న్యూఇయర్ జర్నీ
అందం, నటన సమపాళ్లలో ఉన్న జెనీలియా తెలుగులోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ లోనూ చక్కటి విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ అవుతోంది. తొలినాళ్లలో బాలీవుడ్ లో నటించి, ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆలస్యంగానే గుర్తింపు వచ్చింది. 'బొమ్మరిల్లు' చిత్రంలో హాసినిగా ఆమె నటన యువ హృదయాలను ఆకట్టుకోవడం ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. బాలీవుడ్ లోనూ ఇటీవల 'జానే తు య జానే' చిత్రం ఆమెకు సరైన బ్రేక్ నిచ్చింది. 2009 సంవత్సరం తనకు ఎంతో కలిసి వచ్చిందని చెబుతున్న జెనీలియా న్యూ ఇయర్ వైపు కూడా ఎంతో ఆశావహ దృక్పథంతో చూస్తోంది. సహజంగా నటీనటులు కొత్త సంవత్సరంలో విదేశాలకో, గోవా లాంటి సుందర ప్రదేశాలకో వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. జెనీలియా మాత్రం నాసిక్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అక్కడి చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరుపబోతోంది.నాసిక్ లోని చర్చి అంటే తనకూ, తన కుటుంబ సభ్యులకూ ఎంతో నమ్మకం ఉందనీ, కొత్త సంవత్సరం శుభం జరగాలని కోరుకుంటూ చర్చికి వెళ్తున్నాననీ జెనీలియా చెప్పుకొచ్చింది. కెరీర్ పరంగా 2009 తనకు బాగా గుర్తుండిపోయే సంవత్సరమనీ, భగవంతుడి అనుగ్రహమే ఇందుకు కారణమనీ ఆమె అంటోంది. ప్రస్తుతం జెనీలియా హిందీలో రెండు, తెలుగులో ఒక చిత్రంలో నటిస్తోంది. సాహిద్ కపూర్ సరసన నటించిన 'ఛాన్స్ పే డాన్స్' విడుదలకు సిద్ధంగా ఉండగా, దీని వెనుకే డేవిడ్ ధావన్ 'హుక్ య క్రూక్' విడుదలవుతుంది. ఇందులో జాన్ అబ్రహంకు జోడిగా జెనీలియా నటిస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరనన నటిస్తున్న 'ఆరంజ్' చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment