యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అదుర్స్' చిత్రం భారీ అంచనాల మధ్య జనవరి రెండో వారంలో సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'అదుర్స్' విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు 'అదుర్స్' న్యూ ఇయర్ క్యాలెండర్ ను రూపొందించారు. దీనిని ఎన్టీఆర్, వినాయక్, కొడాలి నాని ఆవిష్కరించారు.'అదుర్స్' చిత్రం పెద్ద సక్సెస్ కావాలని ఈ సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు వి.ప్రతాప్ రెడ్డి (నెల్లూరు), ఎన్.జీవన్ (కర్నూలు), చౌదరి, ఎం.నరసింహులు, రాజుయాదవ్, ఇమ్మానుయేల్ (హెద్రాబాద్) తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment