సంక్రాంతికి పెర్ ఫెక్ట్ సినిమా

ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్ వంటి అంశాలన్నీ ఉన్న పెర్ ఫెక్ట్ సినిమా 'నమో వెంకటేశ' అని ఆ చిత్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ అభివర్ణించారు. 'నవ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' తరహాలో ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనీ, ఇంతకుమందు కొన్ని చిత్రాల్లో కామెడీ చేసినప్పటికీ ఇందులో కామెడీ పీక్ లెవల్ లో ఉంటుందనీ తెలిపారు. వెంకటేష్ కథానాయకుడుగా వరుస హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.వెంకటేష్ మరిన్ని వివరాలు తెలుపుతూ, శ్రీనువైట్ల కామెడీలో చాలా మంచి టైమింగ్ ఉందనీ, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తీస్తున్నారనీ తెలిపారు. 'అడవారి మాటలకు అర్ధాలు వేరులే' తర్వాత త్రిష కాంబినేషన్, 'తులసి' తర్వాత దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రమిదని అన్నారు. సినిమాకి బ్రహ్మానందం క్యారెక్టర్ మరో హైలైట్ అవుతుందన్నారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ, తనకు ఇష్టమైన వెంకటేష్ బాబుతో 'నమో వెంకటేశ' చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు. పండుగకు అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించే ఓ విందు భోజనంలాంటి సినిమా ఇదని పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు కూడా ఎంతో పట్టుదలగా లావిష్ గా ఈ చిత్రాన్ని తీశారని చెప్పారు. సంక్రాంతికి ఈ చిత్ర విజయం యూనిట్ అందరికీ పెద్ద గిఫ్ట్ అవుతుందని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, వెంకటేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ అంటేనే చాలా పెద్ద అంచనాలు ఉంటాయనీ, వాటికి ధీటుగా పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోందనీ చెప్పారు. ఈనెల 4న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుందని చెప్పారు. 3 నుంచి 6 వరకూ ఫారిన్ లో వెంకటేష్-త్రిష జంటపై చివరి పాట చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుందన్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, కోట శ్రీనివాసరావు, జెపి, ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, ధర్మవరపు, ముఖేష్ రిషి, సుబ్బరాజు, సురేఖవాణి, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. చింతపల్లి రమణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు.

No comments:

Post a Comment