2009: డీలాపడ్డ కొత్తదనం

ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాలే అనుకునే పరిస్థితి ఒకనాటిది. ఏటా అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న తెలుగు పరిశ్రమ ఇటీవల కాలంలో మార్కెట్ పరిధిని కూడా విస్తరించుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే నాణ్యతాపరంగా, సక్సెస్ ల పరంగా ఇప్పటికీ తెలుగు సినిమా ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగానే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచనలతో పరిశ్రమకు వచ్చేవారికి ఘన స్వాగతం లభిస్తోంది. ఎందరెందరో నూతన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సాంకేతిక నిపుణులు చిత్రసీమలోకి అడుగుపెడుతూ తమ ప్రతిభా పాటవాలను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది జయాపజాయాలను అవలోకన చేసుకుంటే నూతన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు లెక్కకు మిక్కిలిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినా వారి సక్సెస్ శాతం చాలా తక్కువ. దీంతో కొత్తదనం డీలాపడింది.దర్శకులు 50కి పైనే...ఈ ఏడాది 50కి పైగా కొత్త దర్శకులు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', జయరవీంద్ర దర్శకత్వం వహించిన 'బంపర్ ఆఫర్' చిత్రాలు యావరేజ్ అనిపించుకున్నాయి. 'మిత్రుడు' చిత్రం ద్వారా మహాదేవ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదట్లో ఈ చిత్రానికి ఓపినింగ్స్ బాగానే వచ్చినప్పటికికీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన 'బాణం', వాసువర్మ దర్శకత్వంలో రూపొందిన 'జోష్', గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్ గుణ్ణం దర్శకుడుగా పరిచయమైన 'కుర్రాడు', చక్రి తేలేటి 'ఈనాడు', శరవణన్ దర్శకత్వం వహించిన 'గణేష్', శ్రీనివాస్ రాగ 'కథ', శంకర్ కె.మార్తాండ్ 'ఎవరైనా ఎపుడైనా' వంటి చిత్రాలు మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఏవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అలాగే నూతన దర్శకులలో రాజమౌళి శిష్యుడు కరుణకుమార్ 'ద్రోణ', హర్షారెడ్డి 'ఇందుమతి', కరుణ ప్రకాష్ 'కావ్యాస్ డైరీ', రాజ్ పిప్పాళ్ల 'బోణి', చిన్నా 'ఆ ఇంట్లో', ఎం.నాగేంద్రకుమార్ 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్' చిత్రాల ద్వారా పరిచయమయ్యారు. వీరెవరికీ సరైన బోణీ దక్కలేదు. మరికొందరు కొత్త దర్శకులు కూడా ఇదే బాటలో పయనించారు

No comments:

Post a Comment