తెలుగు సినిమా ఈ ఏడాది కూడా రాశిపరంగా సత్తా చాటుకున్నప్పటికీ చిటికెటు హిట్లు కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంది. ఈసారి తమిళ డబ్బింగ్ చిత్రాల జోరు మళ్లీ పెరగడం, హాలీవుడ్ అనువాదాలు రెండంకెల సంఖ్యలో విడుదల కావడం విశేషం. కొన్ని తెలుగు చిత్రాలతో పోలిస్తే డబ్బింగ్ చిత్రాల కలెక్షన్లు ఎక్కువగా ఉండటం ఈ ఏడాది కనిపిస్తుంది. ప్రథమార్థం సాఫీగానే తెలుగు సినిమా నడక సాగినా ద్వితీయార్థం చోటుచేసుకున్న పరిణామాలు సినీ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేసింది. తెలంగాణ, ఆంధ్ర ఆందోళనలు, బంద్ లు, షూటింగ్ లపై దాడులు వంటివి సినీ పరిశ్రమ అస్తిత్వానికి పెను సవాలుగా మారాయి.ఈ ఏడాది 131 తెలుగు సినిమాలు, 40 డబ్బింగ్ సినిమాలు, 20 హాలీవుడ్ అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జనవరిలో రిలీజైన 'అరుంధతి', జూలైలో వచ్చిన 'మగధీర' బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 14 కోట్లతో తీసిన 'అరుంధతి' చిత్రం 30 కోట్లకు పైగా రాబట్టి అనుష్కకు స్టార్ హీరోయిన్ హోదా తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' చిత్రం తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రను తిరగరాసి 2009లో ఇండస్ట్రీ టాప్ హిట్ గా నిలిచింది. 35 కోట్లతో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా సత్తాను ఇతర భాషా చిత్రాలకు చాటిచెప్పింది. రవితేజ కథానాయకుడుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'కిక్' సూపర్ హిట్ కాగా, అల్లరి నరేష్ 'బెండు అప్పారావు' హిట్ గా నిలిచింది. ప్రభాస్ 'బిల్లా', నాని-తనీష్ 'రైడ్', త్రిష 'ఆకాశమంత', అల్లు అర్జున్ 'ఆర్య 2' ఎబౌ యావరేజ్ అనిపించుకున్నాయి. సిద్దార్ధ 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', రామ్ 'మస్కా', తరుణ్-జెనీలియా 'శశిరేఖా పరిణయం', సాయిరాం శంకర్ 'బంపర్ ఆఫర్', వంశీ దర్శకత్వంలో వేణు-కమలిని ముఖర్జీ జంటగా నటించిన 'గోపి గోపిక గోదావరి', నారారోహిత్ 'బాణం', కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ 100వ చిత్రంగా వచ్చిన 'మహాత్మ', కృష్ణుడు నటించిన 'విలేజ్ లో వినాయకుడు', చిన్నా తొలిసారి దర్శకత్వం వహించిన 'నా ఇంట్లో' వంటివి ఉన్నాయి
No comments:
Post a Comment