రవితేజతో 'టాలీ 2 హాలీ'

అమెరికాలో పలు తెలుగు సినిమాలను పంపిణీ చేసి ఇటీవల నేరుగా తెలుగు చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన 'టాలీ 2 హాలీ ఫిలిమ్స్' తమ సంస్థ మూడో చిత్రాన్ని రవితేజ కథానాయకుడిగా నిర్మించబోతోంది. ఇంతవరకూ అజయ్ కథానాయకుడుగా 'ఆ ఒక్కడు', జగపతిబాబు హీరోగా 'ప్రవరాఖ్యుడు' చిత్రాలను సంస్థ అధినేత గణేష్ ఇందుకూరి నిర్మించారు. తొలి చిత్రం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసినా రెండో చిత్రం యావరేజ్ సక్సెస్ ను అందుకుంది. తృతీయ ప్రయత్నంగా రవితేజ హీరోగా ఓ భారీ చిత్రాన్ని కొత్త సంవత్సరంలో నిర్మించనున్నారు.ఈ చిత్రానికి అద్భుతమైన స్క్రిప్టు రెడీ అయిందనీ, రవితేజ కెరీర్ లో ఇది మరో డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అవుతుందనీ సంస్థ తెలియజేసింది. భారీ ఎత్తున ఈ చిత్ర నిర్మాణం ఉంటుందనీ, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామనీ ప్రకటించారు.

No comments:

Post a Comment