నిర్మలమైన ప్రేమకు చిహ్నం 'తాజ్ మహల్'. ప్రేమను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తాజ్ మహల్ ను ప్రేమిస్తారు. హీరో శివాజీ కథానాయకుడుగా నటిస్తూ తొలిసారి నిర్మాతగా మారి శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై 'తాజ్ మహల్' చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ సింగరాజు దర్శకుడు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.శివాజీ మాట్లాడుతూ, కన్నడంలో పెద్ద విజయం సాధించిన 'తాజ్ మహల్' చిత్రం తనను ఎంతో ఆకట్టుకోవడంతో అసలు చిత్ర నిర్మాణం అంటే ఆసక్తి లేనితాను నిర్మాతగా మారాననీ, బయట నిర్మాతతో చేస్తే నాకున్న మార్కెట్ రీత్యా నిర్మాణ పరంగా కథకు అన్యాయం జరిగే అవకాశం ఉందని భావించాననీ చెప్పారు. 'ఇందుమతి' చిత్రంలో నటిస్తున్నప్పుడు పరిచయమైన అరుణ్ కి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించాననీ తెలిపారు. అరుణ్ సైతం అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని మలిచారని అన్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నట్టు చెప్పారు. శివాజీ కెరీర్ లో ఇదో పెద్ద హిట్ చిత్రమవుతుందని అరుణ్ తెలిపారు. శివాజీకి జోడిగా శ్రుతి అనే అమ్మాయి పరిచయమవుతోంది. ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు తదితరులు నటించారు. సోమా విజయప్రకాష్ నిర్మాణ సారథ్యం వహించిన ఈ చిత్రానికి గంగోత్రి విశ్వనాథ్ మాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, అభిమాన్ సంగీతం అందించారు
No comments:
Post a Comment