దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సమచారంతో అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ సిఇవోగా వెలువడుతున్న 'సౌత్ స్కోప్' ఆంగ్ల సినీ మాసపత్రిక కొత్తపుంతలు తొక్కుతోంది. ఇటీవలే 'సౌత్ స్కోప్ స్టైల్' తొలి అవార్డుల ప్రదానంతో దక్షిణాది పరిశ్రమకు దగ్గరైంది. తాజాగా 'మాగ్జిమ్' తరహాలో మాసపత్రికను మరింత సర్వాంగసుందరంగా తీర్దిదిద్దుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శ్రియా శరణ్ ఇప్పుడు 'సౌత్ స్కోప్' 2010 జనవరి సంచిక కవర్ పేజీపై ప్రత్యక్షమైంది. 'సెన్సుయస్ శ్రియ బేర్స్ హెర్ సోల్' అనే కథనంతో శ్రియ కవర్ పేజీ అత్యంత సెక్సీ లుక్స్ ను సంతరించుకుని గ్లామర్ ప్రియుల మనసులను కూడా దోచుకుంటోంది. వీపుపై ఎలాంటి అచ్చాదనం లేకుండా ఆమె తన గ్లామర్ అందాలను పరచడం విశేషం. ఈమధ్యనే 'మాగ్జిమ్' కవర్ పై తళుక్కుమన్న శ్రియ తాజాగా 'సౌత్ స్కోప్' కవర్ పై చేరి దక్షిణాది 'హాట్' ఫేవరెట్ గా కూడా తనకు తిరుగులేదని చాటుకున్నట్టే.
No comments:
Post a Comment