మలయాళ కుట్టి షీలా ఇప్పుడు ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రానికి పబ్లిసిటీ పరంగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవుతోంది. ఇందులో నయనతార మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ ఆమెను దాదాపు తోసిరాజనేలా ఆమె గ్లామర్ లుక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. షీలా సైతం ఈ చిత్రం గ్లామర్ హీరోయిన్ గా తనకు సరైన బ్రేక్ ఇస్తుందనే గట్టి నమ్మకంతో ఉంది.'సీతాకోకచిలుక' చిత్రంలో నవదీప్ కు జోడిగా షీలా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూడటంతో కొంత గ్యాప్ తీసుకుని సాయిరాం శంకర్ 'హలో ప్రేమిస్తారా', మంచు మనోజ్ 'రాజుభాయ్' చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఆ రెండు చిత్రాలు సైతం ఫెయిల్ కావడంతో షీలా కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో బొమ్మరిల్లు భాస్కర్ ఆమెకు 'పరుగు' చిత్రంతో సరైన బ్రేక్ ఇచ్చారు. అల్లు అర్జున్ కు జోడిగా నటించిన ఈ చిత్రం షీలాకు మంచిపేరు తెచ్చింది. ఆ తర్వాత రామ్ సరసన నటించిన 'మస్కా' చిత్రం మరో సక్సెస్ అందించింది. ఇందులో హన్సిక వంటి హీరోయిన్ ఉన్నప్పటికీ షీలా ఆలవోకగా తన అందాలు ప్రదర్శించి యూత్ ను తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు ఆమె నటిస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం 'అదుర్స్' విడుదలకు సిద్ధమైంది. హీరోయిన్లను గ్లామర్ గా చూపించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు వి.వి.వినాయక్ షీలా అందాలతో కుర్రకారుపై వల వేసినట్టు ట్రైలర్స్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఈ చిత్రంతో తన కెరీర్ తెలుగులో మరింత బిజీ అవుతుందనే నమ్మకంతో షీలా ఉంది.
No comments:
Post a Comment