'అర్య-2' ప్రింట్లు వెనక్కి...

అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'ఆర్య-2' చిత్ర ప్రదర్శనను అధికారికంగా నైజాం అంతా నిలివేసినట్టు నిర్మాత ఆదిత్యబాబు తెలిపారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఆంధ్ర నటుల చిత్రాలను ఆడనీయమని తెలంగాణ అనూకూల వాదులు నిర్ణయించడం 'ఆర్య-2' చిత్రంపై గట్టి ప్రభావాన్ని చూపింది. ఆందోళనకారులు ఆ చిత్ర ప్రదర్శనను అడ్డుకోవడం, బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేయడం, కొండొకచే రీళ్లకు నిప్పు పెట్టడంతో చిత్ర ప్రదర్శనను ఎగ్జిబిటర్లు నైజాంలో నిలిపివేశారు. ఈ క్రమంలో నైజాం అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున తమ చిత్రం ప్రింట్లు వెనక్కి తెప్పిస్తున్నట్టు ఆదిత్యబాబు చెప్పారు.మంచి ఓపినింగ్స్ తో మొదలైన 'ఆర్య-2' చిత్రానికి నైజాంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామనీ, పరిస్థితి చక్కబడిన తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకువస్తామని తెలిపారు. ఆ రోజు త్వరగా రావాలని తాను కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

No comments:

Post a Comment