'వయ్యారి భామ నీ హంస నడకా' అంటూ కవులు వర్ణించే లలనామణులు జిగేల్ మనే దుస్తులతో ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలకపోవచ్చు. బాలీవుడ్ ముద్దుగుమ్మలను అనుకరిస్తూ ఇప్పుడు పలువురు దక్షిణాది తారామణులు ర్యాంప్ వాక్ చేస్తూ సౌందర్యోపాసకులను ఆకట్టుకుంటున్నారు. జెనీలియా, శ్రియ, త్రిష, మమతా మోహన్ దాస్, తమన్నా, నమిత వంటి దక్షిణాది హీరోయిన్లు స్టారీ క్యాట్ వాక్ తో అలరిసిస్తున్న వారే. చెన్నైలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసిన జెనీలియా తన సన్నిహిత మిత్రురాలు ఇషితా సింగ్ కోసం ర్యాంప్ పై నడిచినట్టు చెప్పుకొచ్చింది. 'బొమ్మరిల్లు' చిత్రంలో జెనీలియా కాస్ట్యూమ్స్ ను ఇషితా డిజైన్ చేశారు. మరి టాలీవుడ్ లో నెంబర్ వన్ రేసులో పోటీపడుతున్న ఇలియానా ముచ్చటో? ఆఫర్లకు కొదవలేదు కానీ...2004 నుంచి దూరంగా ఉంటున్నట్టు ఇలియనా తెలిపింది. అయితే 2010లో ఆ కోరిక తీరుస్తానని చెప్పుకొచ్చింది.మోడల్ గా ఉన్నప్పుడు తన ఫ్రెండ్ సన్ గ్లాస్ కలెక్షన్ ప్రమోషన్ కోసం ర్యాంప్ పై నడిచాననీ, అయితే సినిమాల్లోకి వచ్చాక క్యాట్ వాక్ చేయలేదనీ ఇలియానా తెలిపింది. వచ్చే ఏడాది మాత్రం మళ్లీ ర్యాంప్ పై ప్రత్యక్షమవుతానని భరోసా ఇచ్చింది. అది కూడా తన తల్లి కోసం కావడం విశేషం. 'ఫ్యాషన్ అంటే అమ్మకు చాలా ఇష్టం. చెల్లాయి ఫరాతో కలిసి ఎన్నో ప్రత్యేకమైన కలెక్షన్లకు అమ్మ డిజైన్ చేసింది. వాటిని ధరించి వచ్చే ఏడాది ఉగాదికి ఫ్యాషన్ వీక్ లో పాల్గొనబోతున్నాను' అని ఇలియానా నవ్వుతూ చెప్పింది. ఇలియానా అభిమానులకు ఇక పండుగే
No comments:
Post a Comment