రామ్ చరణ్ కథానాయకుడుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ షాజాన్ పదామ్సీ సెకెండ్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలిసింది. ఈ చిత్రంలో జెనీలియా ప్రధాన హీరోయిన్ కాగా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించే పాత్రలో షాజాన్ నటించనుంది.తొలుత సెకెండ్ హీరోయిన్ పాత్రలో శ్రుతి హాసన్ (కమల్ కుమార్తె) ఎంపికైనట్టు ప్రచారం జరిగింది. అయితే ఇందులో తనది ఫుల్ ప్లెజ్డ్ పాత్ర కాదని భావించడంతో ఆ పాత్రను శ్రుతి తోసిపుచ్చిందట. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన 'రాకెట్ సింగ్' చిత్రంలో నటించిన షాజాన్ పదామ్సీని భాస్కర్ సంప్రదించడం, ఆమె ఓకే చేయడం జరిగిందని సమాచారం. ఇందులో రామ్ చరణ్ కొత్తగా, స్టయిలిష్ గా కనిపించబోతున్నారు. 'మగధీర' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు భాస్కర్ ఈ చిత్రాన్ని పట్టుదలగా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ తరహాలోనే భాస్కర్ కు కూడా ఇది మూడో చిత్రం కావడం విశేషం. ఇటీవల ముంబైలో ఓ షెడ్యూల్ జరుపుకొన్న చిత్రయూనిట్ ఆస్ట్రేలియాలో 3 నెలల కీలక షెడ్యూల్ కు ప్లాన్ చేసింది. దీనికి 'ఆరంజ్' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ చిత్రానికి హారిస్ జైరాస్ సంగీతం అందిస్తున్నారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
No comments:
Post a Comment