హీరో శ్రీకాంత్ ఇటీవలే తన 100వ చిత్రం 'మహాత్మ' ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ స్నేహితుడు సి.ఆర్.మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పాక్షిక విజయాన్ని నమోదు చేసుకుంది. దీని తర్వాత మళ్లీ శ్రీకాంత్-మనోహర్ కాంబినేషన్ లో ఓ కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. దీనికి 'రంగా' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. 'ది దొంగ' అనే తమాషా ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈ చిత్రానికి జి.వి.దర్శకత్వం వహించనున్నారు.నటుడిగా పలు విలనీ పాత్రలు పోషించిన జి.వి. ఇటీవల దర్శకుడుగా మారి నితిన్ తో 'హీరో' చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసినప్పటికీ జి.వి. టేకింగ్ కు మంచి పేరే వచ్చింది. ఆ చిత్రం తర్వాత ఇప్పుడు మరో అవకాశం ఆయన తలుపుపట్టింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ కు జోడిగా ఛార్మి ఎంపికైంది. ఇటీవల ఈ ఇద్దరూ కలిసి 'కౌసల్య సుప్రజ రామ' చిత్రంలో నటించారు. 'మహాత్మ' చిత్రంలోనూ ఛార్మి ఓ ఐటెం సాంగ్ లో నర్తించింది. ఆ సందర్భంలోనే ఛార్మితో ఓ సినిమా చేయాలని మనోహర్ అనుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబధించిన అధికారిక సమాచారం బయటకు రానుంది.
No comments:
Post a Comment