ఏడాదికి కనీసం రెండు చిత్రాలు విడుదలయ్యే చూసుకోవాలని యంగ్ జనరేషన్ హీరోలు నిర్ణయం తీసుకోవడంతో ఆ రేసులో ఎన్టీఆర్ ముందున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'అదుర్స్' చిత్రం జనవరి ప్రథమార్థంలో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'బృందావనం' చిత్రం షూటింగ్ ప్రోగ్రస్ లో ఉంది. ఇటీవల పొల్లాచ్చిలో పాట చిత్రీకరణతో ప్రారంభమై ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది. ఇదే తరుణంలో మరో కొత్త చిత్రం షూటింగ్ లో అడుగుపెట్టేందుకు కూడా ఎన్టీఆర్ సిద్ధపడుతున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్ తో 'కంత్రి', ప్రభాస్ తో 'బిల్లా' చిత్రాలను అందించిన మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. జనవరి 11న ఈ కొత్తచిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. దీనికి 'శక్తి' అనే టైటిల్ ఖరారు చేశారు.ఎన్టీఆర్ సరసన 'ఇలియానా' కథానాయికగా ఎంపిక చేయగా, సెకెండ్ హీరోయిన్ గా బాలీవుడ్ టి అమృతారావు పేరు పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్ అత్త పాత్ర ఇందులో కీలకం కావడంతో ఆ పాత్ర కోసం సీనియర్ నటి శ్రీదేవితో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందనీ, ప్రపంచవ్యాప్తంగా 14 లొకేషన్లలో షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారనీ తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించబోతున్నారు
No comments:
Post a Comment