బ్రహ్మీ 'భలే భలే నవ్వులు'

'నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం' అని హాస్యబ్రహ్మ జంధ్యాల ఉవాచ. నవ్వు నాలుగు విధాల చేటు కాదు అనీ, నాలుగు విధాల గ్రేటు అనీ, ఆరోగ్యానికి పరమౌషధమని అంతా అంగీకరిస్తున్న తరుణమిది. అందుకే లాఫింగ్ క్లబ్ లూ లెక్కకు మిక్కిలిగా వెలుస్తున్నాయి. అందర్నీ నవ్వించడమే థ్యేయంగా ఖమ్మం వాసి, హాస్య కవి జి.వాసు రెండు పుస్తకాలు రచించారు. 'నవ్వండి-నవ్వించండి', 'భలే భలే నవ్వులు' పేరుతో ఈ పుస్తకాలు రాశాయి. ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ హైద్రాబాద్ లో జరిగింది.హాస్యనటుడిగా 25 ఏళ్ల వ్యవధిలో 754 చిత్రాలు చేసి గిన్నెస్ రికార్డ్ సాధించిన పద్మశ్రీ బ్రహ్మానందం ఈ పుస్తకాలను ఆవిష్కరించారు. రచయిత జి.వాసు, దీప్తి పబ్లికేషన్స్ (విజయవాడ) వెంకట కృష్ణయ్య, విజయ్, సినీ పాత్రికేయులు ఎల్.రాంబాబువర్మ, జి.హరా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

No comments:

Post a Comment