'బెండు అప్పారావు ఆర్ఎంపి' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత దర్శకుడు ఇవివి సత్యనారాయణ కొత్త సంవత్సరం తొలి రోజున తన 50వ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. బిగ్ బి ప్రొడక్సన్స్ బ్యానర్ లో రూపొందే ఈచిత్రంలో ఆర్యన్ రాజేష్ కథానాయకుడు. ఐశ్వర్య హీరోయిన్ గా పరిచయమవుతోంది. జనవరి 1న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు ఇవివి తెలిపారు.ఇప్పటి వరకు తాను తీసిన కామెడీ చిత్రాల్లో అత్యుత్తమమైన చిత్రంగా ఈ సినిమా ఉంటుందనీ, పక్కా స్క్రిప్టు రెడీ అయిందనీ ఆయన తెలిపారు. రెండున్నర గంటల నాన్ స్టాప్ కామెడీగా ఈ చిత్రం ఉంటుందన్నారు. 1వ తేదీ నుంచి హైద్రాబా లోనూ, రామోజీ ఫిల్మ్ సిటీలోనూ షూటింగ్ జరుగుతుందనీ, ఫ్రిబ్రవరిలో బ్యాంకాక్ లో కొంత టాకీ, కొన్ని పాటలు ప్లాన్ చేశామని అన్నారు. పరిశ్రమలోని ప్రముఖ హాస్యనటులంతా ఇందులో ఉంటారని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, చలపతిరావుతో కోవైసరళ, రఘుబాబుతో థాయ్ లాండ్ అమ్మాయి, జయప్రకాష్ రెడ్డితో శకుంతల (డ్యూయల్ రోల్), కృష్ణ భగవాన్ తో అనితానాగ్, ఆలీతో లావణ్య జ్యోత్స్న, జీవాతో సన, ఎల్బీ శ్రీరామ్ తో సురేఖావాణి, శివారెడ్డితో అల్లరి సుభాషిణి, సుమన్ శెట్టితో హేమ, తిరుపతి ప్రకాష్ తో గీతాసింగ్ నటించనున్నారు. ఇతర పాత్రల్లో ఏవీఎస్, గుండు సుదర్శన్, చిట్టిబాబు, గౌతంరాజు, జయలలిత తదితరులు నటిస్తారు. జనార్థన మహర్షి మాటలు, వేగేశ్న సతీష్-మోహన్-శ్రీనివాస్ రచనా సహకారం, రామజోగయ్య శాస్త్రి పాటలు, శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, నందు ఫైట్స్, కోటి సంగీతం అందించనున్నారు.
No comments:
Post a Comment