సినీ పరిశ్రమను నమ్ముకుని పత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఉన్నాయనీ, సృజనాత్మక కళారంగమైన చిత్రరంగంపై తాత్కాలిక ఆవేశంలో కొందరు దాడి చేస్తూ భయోత్పాతం సృష్టించడం వాంఛనీయం కాదనీ పరిశ్రమ ప్రముఖులు పేర్కొన్నారు. ఈ మేరకు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వి.వి.బాలకృష్ణారావు, కార్యదర్శి కె.సి.శేఖర్ బాబు, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి ఎం.ప్రసన్న కుమార్, హైద్రాబాద్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం.విజయేందర్ రెడ్డి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.మురళీ మోహన్, ఏవి ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి కె.రాజేశ్వరరెడ్డి ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.సినిమా వాళ్లకు అందరూ కావాలనీ, అందరికీ సినిమాలు కావాలనీ, అన్ని ప్రాంతాలు ఆదరిస్తేనే సినిమాకు మనుగడ ఉంటుందనీ వారు పేర్కొన్నారు. సినిమాలకూ, రాజకీయాలకూ ఏమాత్రం సంబంధం లేదనీ, వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా షూటింగ్ లపై దాడి చేయడం తగదని వారు అభిప్రాయపడ్డారు. సంబంధిత సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. షూటింగ్ లకు ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకూ దాడులకు గురైన సినిమా యూనిట్స్ కు తమ సంపూర్ణ మద్దతు, సంఘాభావాన్ని వారు ప్రకటించారు
No comments:
Post a Comment