మహేష్ బాబు నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్స్ పై తెలంగాణ ఆందోళనకారులు గురువారంనాడు విరుచుకుపడ్డారు. వికారాబాద్ సమీపంలో ఈ చిత్రం షూటింగ్ కోసం కోటి రూపాయల భారీ సెట్ ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కనకరత్న మూవీస్ పతాకంపై సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చివరి షెడ్యూల్ లో భాగంగా వికారాబాద్ సెట్ లో వేసిన భారీ సెట్ కు ఆందోళన కారులు నిప్పుపెట్టి సెట్స్ ను కూలదోసి విధ్వంసం సృష్టించారు.ఆందోళన కారులు 'జై తెలంగాణ' నినాదాలతో ఆ ప్రాంతంపై విరుచుకుపడి విధ్యంసకాండ జరిపారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనతో కొద్దిరోజులుగా రాష్ట్రం అట్టుడుగుతున్న తరుణంలో ఆంధ్ర ప్రాంతం వారి సినిమాలు గానీ, షూటింగ్ లు గానీ జరగనీయమంటూ తెలంగాణ శ్రేణులు అల్టిమేటం ఇవ్వడంతో వరుసగా మూడో రోజు కూడా షూటింగ్ లపై దాడులు కొనసాగాయి. మంగళవారంనాడు మంచు మనోజ్ సినిమా షూటింగ్ పైన, బుధవారం అల్లు అర్జున్ 'వరుడు' షూటింగ్ పైన దాడులు జరిగాయి
No comments:
Post a Comment