రెండో వారంలో 'అదుర్స్'

ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అదుర్స్' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ (ప్రై) లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కొడాలి నాని మాట్లాడుతూ, ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన మరో సెన్సేషనల్ మూవీ 'అదుర్స్' అనీ, 'సాంబ' తర్వాత తమ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీపడకుండా నిర్మించామనీ చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టయిందన్నారు. అన్ని ఏరియాల నుంచి ఆడియోకి రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయని తెలిపారు. జనవరి రెండో వారంలో సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తో 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత 'అదుర్స్' హ్యాట్రిక్ ఫిలిం అవుతుందన్నారు. ఎన్టీఆర్ మినహా ఎవరూ 'అదుర్స్'లోని రెండు పాత్రలు చేయలేరనీ, ఎన్టీఆర్ నటన అదుర్స్ అనిపించేలా ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్రం తప్పనిసరిగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. ఒక మంచి కాంబినేషన్ లో ఈ సినిమాను తమ బ్యానర్ లో చేయడం హ్యాపీగా ఉందని నిర్మాత వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఈ సంక్రాంతికి పెద్ద విజయం సాధించడానికి 'అదుర్స్' చిత్రం రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తోందని అన్నారు. ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు, తనికెళ్ల భరణి, రమాప్రభ, రాజ్యలక్ష్మి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.కోన వెంకట్ కథ-మాటలు, చంద్రబోస్ పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనందసాయి ఆర్ట్, స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

No comments:

Post a Comment