'పులిహోర' అంటే పండుగ గుర్తొస్తుంది. అచ్చమైన తెలుగువంటకం ఊహల్లో మెదులుతుంది. మాటీవీ ఇప్పుడు బుల్లితెర వీక్షకులకు అందిస్తున్నసరికొత్త నవ్వుల ఖజానా 'పులిహోర'. పలు వినూత్న కార్యక్రమాలు, ధారావాహికలను అందిస్తున్న మాటీవీ హాస్యరసాన్ని కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ కామెడీ సీరియల్ ను అందించబోతోంది. మాటీవీ సమర్పణలో ఎవర్ గ్రీన్ ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న ఈ ధారావాహిక సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకూ మాటీవీలో ప్రసారమవుతుంది.కుటుంబ సభ్యులందరూ కూర్చొని హాయిగా నవ్వుకునేలా ఆరోగ్యకరమైన హాస్యంతో నిండిన వంటకం ఇదనీ, ఎన్నో హాస్య చిత్రాల్లో హీరోగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నరేష్ ఈ ధారావాహికలో లీడ్ రోల్ పోషిస్తున్నారనీ ప్రోగ్రాం నిర్వాహకులు తెలిపారు. మాటీవీలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న అవధానం ఆర్.కె.శాస్త్రి ఈ ధారావాహికకు రచన చేస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మీర్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతర పాత్రల్లో సుబ్బరాయ శర్మ, నిట్టల, చిట్టిబాబు, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment