అగ్రహీరోల్లో ఒకరైన బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశాన్ని బ్యూటీ మమతా మోహన్ దాస్ ఈమధ్యనే సున్నితంగా తోసిపుచ్చింది. షరామామూలుగానే 'సారీ డేట్లు ఖాళీ లేవు..' అంటూ ఓ ఎస్.ఎం.ఎస్. ద్వారా తన సమాధానం ఆయనకు తెలియజేసింది. బాలకృష్ణ నటిస్తున్న 'సింహా' చిత్రంలో ఓ హీరోయిన్ పాత్రకు మమతను సంప్రదించినప్పుడు అప్పటికే ఆ చిత్రంలో నమిత, స్నేహ ఉల్లాల్ వంటి మెయిన్ హీరోయిన్లు ఉండటంతో ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించడం ఎందుకని అనుకుందే ఏమో కానీ ఆ ఆఫర్ ను తన ఎస్.ఎం.ఎస్. రిప్లై ద్వారా తోసిపుచ్చింది.'యమదొంగ', 'చింతకాయల రవి' వంటి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన మమత ఇటీవల తన మనసు మార్చుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు. నాగార్జున 'కింగ్' చిత్రంలో ఓ హీరోయిన్ గా మమత నటించినప్పటికీ ఆమె పాత్రను ఫైనల్ ఎడిటింగ్ లో బాగా కత్తిరించేశారు. సినిమా సక్సెస్ అయినా తన పాత్రను ఓ ఎక్స్ ట్రా యాక్ట్రస్ మాదిరిగా మార్చేశారంటూ మమత అప్పట్లో బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తి చేసింది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్న చిత్రాల్లో ఆఫర్లు వచ్చినా తోసిపుచ్చింది. మమత అసంతృప్తిని పసిగట్టడం వల్లనే ఏమో కానీ నాగార్జున 'కేడీ' చిత్రంలో ఆమెకు సోలో హీరోయిన్ పాత్ర ఇచ్చారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆ చిత్రం తర్వాత సోలో హీరోయిన్ గానే తన ప్లేస్ పటిష్టమవుతుందని మమత గట్టి నమ్మకంతో ఉంది. ఈ తరుణంలోనే 'సింహా' చిత్రంలో వచ్చిన ఆఫర్ ను మమత తోసిపుచ్చింది. ఇప్పుడు ఆమెకు అనుకున్న పాత్రలో నయనతార వచ్చి చేరింది. 'సింహా' విడుదలైన తర్వాత కానీ మమత నిర్ణయం రైటో...రాంగో చెప్పలేం.
No comments:
Post a Comment