దక్షిణాది హాట్ బ్యూటీగా 90వ దశకంలో మలయాళ టాప్ స్టార్స్ చిత్రాలకు సైతం ముచ్చెమటలు పట్టించిన షకీలా త్వరలోనే పెళ్లి పీటలు మీద కూర్చోనుంది. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్తతో ఆమె వివాహం 2010 జూన్ లో జరుగనుంది. ఇటీవల షకీలా ఓ ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. మలయాళ చిత్ర పరిశ్రమ స్లంప్ లో పడిన తరుణంలో షకీలా నటించిన 'బి' గ్రేడ్ చిత్రాలు ఆమెకు అప్పట్లో స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కెరీర్ అంతంత మాత్రంగానే ఉండటంతో తన చిరకాల బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వివాహానికి ఇరుకుటుంబాల పెద్దల అంగీకారం కూడా లభించింది.తన భర్త ఎవరనేది చెప్పేందుకు షకీలా నిరాకరిస్తూనే సరైన సమయంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని పేర్కొంది. కెరీర్ పరంగా మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో 100కు పైగా చిత్రాల్లో ఆమె నటించింది. కేరళలో ఒకే ఏడాది 40కి పైగా చిత్రాల్లో నటించి షకీలా అప్పట్లో సంచలనం సృష్టించింది. రోజుకు లక్ష రూపాయల పారితోషికంతో కేవలం పది పదిహేను రోజుల్లో ఆమె నటించిన చిత్రాలు చుట్టేసేవారు. 20 నుంచి 25 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాలు నిర్మాతలకు లాభాల పంట పండిచాయి. షకీలా 'సాఫ్ట్ పోర్న్'చిత్రాలకు విపరీతమైన డిమాండ్ రావడంతో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల చిత్రాలకు ఓపినింగ్స్ రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో షకీలాపై కత్తికట్టి ఆమెను మలయాళ పరిశ్రమ నుంచి దాటించేంతవరకూ అక్కడి సినీ పెద్దలు విశ్రమించలేదు. దీంతో మలయాళ పరిశ్రమకు దూరమైన షకీలా గణనీయంగా తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ ఆమె నటించిన 'బి గ్రేడ్' చిత్రాలు 'పెదపాప', 'రాజమండ్రి రంభ' వంటి టైటిల్స్ తో విడుదలై కాసులు దండుకున్నాయి. 'నిజం', 'శ్రీ', 'ఆదివారం ఆడవాళ్లకు సెలవు' వంటి పలు స్ట్రయిట్ తెలుగు చిత్రాల్లోనూ చిన్నాచితకా పాత్రలను షకీలా పోషించింది. ఇంత పేరుతెచ్చుకున్నా తనకు సొంత ఇల్లు కూడా లేదనీ, తన కెరీర్ ను దెబ్బతీసిన వారి వివరాలతో త్వరలోనే తన స్వీయచరిత్ర రాస్తానని ఆమధ్య షకీలా ప్రకటించినప్పటికీ అది ఇంకా కార్యరూపంలోకి రాలేదు. వాంప్ తరహా పాత్రలు మినహా నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రలు రావడం లేదని వాపోతున్న షకీలా ఇక పెళ్లితో లైఫ్ లో సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆమె అభిమానులకు కాస్తలో కాస్త ఓ ఊరట కూడా లేకపోలేదు. నటన తన వృత్తి అనీ, వివాహం చేసుకున్నా నటనకు దూరం కానని ఆమె తన తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.
No comments:
Post a Comment