హైదరాబాద్ లో సినిమా షూటింగ్ యూనిట్లపై దాడుల నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ బుధవారంనాడు అత్యవసరంగా భేటీ అయింది. సున్నితమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై చిత్ర పరిశ్రమకు చెందిన వారు వ్యక్తిగతంగా స్పందించకూడదని సమావేశంలో ఓ తీర్మానం చేసినట్టు తెలిసింది. పరిశ్రమ దృష్టిలో అన్ని ప్రాంతాలు ఒకేటన్న భావన సమావేశంలో వ్యక్తమైంది.కె.సి.శేఖర్ బాబు, మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్, నిర్మాతలు దిల్ రాజు, అశోక్ కుమార్, డి.సురేష్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment