నేటి యూత్ కు కావలసిన అన్ని హంగులు, అంశాలతో రూపొందుతున్న చిత్రం 'బద్మాష్'. విద్యావేత్తగా పేరుగాంచిన డాక్టర్ జి.నాగయ్య తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టి ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ఈనెల 7న ప్రారంభమైన ఈ చిత్రం జంటనగరాల్లోని వివిధ ప్రదేశాల్లో నాన్ స్టాప్ షెడ్యూల్ తో షూటింగ్ జరుపుకొంటోంది.చిత్ర విశేషాలను నిర్మాత జి.నాగయ్య తెలియజేస్తూ, ఈ చిత్రం ద్వారా విద్యాధికుడైన నాగ సిద్ధార్ధ హీరోగా, ఏక్తా హీరోయిన్ గా పరిచయవుతున్నారనీ, ఇందులో అదరగొట్టే మాస్ పాత్రలో నాగ సిద్ధార్ధ నటిస్తున్నారనీ, కథకు అన్ని విధాలా అనువైన టైటిల్ 'బద్మాష్' అనీ తెలిపారు. నాగ సిద్దార్ధ పాత్రను పక్కా మాస్ గా, ఇలాంటి 'బద్మాష్' కూడా ఉంటాడా అనే విధంగా దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు నాగ సిద్దార్ధ పేరుకు ముందు 'బద్మాష్' పేరు స్థిరపడుతుందనే నమ్మకం తమకుందనీ అన్నారు. పక్కా మాస్ చిత్రమైనప్పటికీ ఇందులో రొమాన్స్, లవ్ వంటి అంశాలుంటాయనీ, కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందనీ చెప్పారు. హీరోయిన్ ఏక్తా కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటుందన్నారు. క్వాలిటీ పరంగా, సాంకేతికపరంగా ఎక్కడా రాజీపడకుండా చిత్ర నిర్మాణం సాగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ రష్ చూశామనీ, చాలా హ్యాపీగా ఉన్నామనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, సుమన్, ధర్మవరపు, బాబుమోహన్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్నారు. జి.పి.సిద్దార్ధ ఫిల్మ్ అకాడమీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం-స్క్రీన్ ప్లే సైతం అందిస్తున్నారు. పి.వి.గిరి కథ, వెలికొండ శ్రీనివాస్ మాటలు, చంద్రబోస్-అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి పాటలు, ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, కె.వి.కృష్ణారెడ్డి ఎడిటింగ్, గణేష్ ఫైట్స్ అందిస్తున్నారు.
No comments:
Post a Comment