మురళీమోహన్ పితృవియోగం

సీనియర్ నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.మురళీమోహన్ కు పితృవియోగం సంభవించింది. ఆయన తండ్రి మాగంటి మాధవరావు కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్నారు. హైద్రాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మురళీమోహన్ ఆయన పెద్ద కుమారుడు.స్వాంతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది అయిన మాధవరావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు. మురళీమోహన్ కు పితృవియోగం సంభవించడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. బుధవారంనాడు మాధవరావు అంత్యక్రియలు హైద్రాబాద్ లో జరుగుతాయి.

No comments:

Post a Comment